ఏపీ బీజేపీ రాష్ట్ర అద్యక్ష ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. బీజేపీ రాష్ట్ర ఎన్నికల అధికారి, రాజ్యసభ ఎంపీ పాకా సత్యనారాయణ ఈ నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. అధ్యక్ష పదవికి పోటీ చేయాలనుకునే అభ్యర్థులకు నామినేషన్ పత్రాలను పాకా సత్యనారాయణ అందజేస్తారు. నామినేషన్ల స్వీకరణ రేపు (జూన్ 29, 2025) ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పార్టీ కార్యాలయంలో జరుగుతుంది.నామినేషన్ల పరిశీలన మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకు ఉంటుంది. అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవడానికి రేపు సాయంత్రం 4 గంటల వరకు గడువు ఉంది.
Also Read.. |తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్లు అమలయ్యేనా?
అనంతరం జూలై 1న ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్ష ఎన్నిక నిర్వహించి, కొత్త అధ్యక్షుడిని ప్రకటించనున్నారు. ప్రస్తుతం ఎంపీ పురందేశ్వరి ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు.