Menu

chandrababu-and-his-wife-receives- grand-welcome-in-london

లండన్ లో సీఎం చంద్రబాబు దంపతులకు ఘనస్వాగతం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి నారా భువనేశ్వరి వ్యక్తిగత పర్యటన నిమిత్తం లండన్ చేరుకున్నారు. ఈ సందర్భంగా లండన్‌లోని తెలుగు వారు సీఎం దంపతులకు ఘన స్వాగతం పలికారు. తెలుగువారిని సీఎం చంద్రబాబు, భువనేశ్వరి ఆప్యాయంగా పలకరించారు. ఈ పర్యటనలో నారా భువనేశ్వరికి అరుదైన అంతర్జాతీయ గౌరవం దక్కనుంది. ఆమె ఈ నెల 4వ తేదీన లండన్‌కు చెందిన ప్రతిష్టాత్మక సంస్థ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ (ఐఓడీ) నుంచి ఒకే వేదికపై రెండు అవార్డులు అందుకోనున్నారు. ప్రజాసేవ, సామాజిక ప్రభావంలో ఆమె చేసిన కృషికి గుర్తింపుగా ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ హోదాలో ‘డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ 2025’ అవార్డును స్వీకరించనున్నారు. అదేవిధంగా, ‘ఎక్సలెన్స్ ఇన్ కార్పోరేట్ గవర్నెన్స్’ విభాగంలో హెరిటేజ్ ఫుడ్స్ సంస్థకు లభించిన గోల్డెన్ పీకాక్ అవార్డును ఆ సంస్థ వీ సీఎండీ హోదాలో భువనేశ్వరి అందుకోనున్నారు. ఈ ప్రతిష్టాత్మక అవార్డుల స్వీకరణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా పాల్గొననున్నారు.

Also Read..| మొంథా తుఫాను బీభత్సంపై అధికారులతో మంత్రి లోకేష్ సమీక్ష

chandrababu and his wife in london

Share the post

Also Read..