Menu

  • Home
  • సినిమా
  • ప్రియాంక జవాల్కర్ గ్లామర్ తళుకులు.. సోషల్ మీడియాలో వైరల్ !
Priyanka-Jawalkar's-Latest-Photos

ప్రియాంక జవాల్కర్ గ్లామర్ తళుకులు.. సోషల్ మీడియాలో వైరల్ !

ప్రియాంక జవాల్కర్ టాాలీవుడ్ తెరపై తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న యువ నటి. తాను ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. తన అందమైన, ఆకట్టుకునే ఫోటో షూట్లతో ఆమె నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్నారు. ముఖ్యంగా ప్రియాంక షేర్ చేసిన మెటాలిక్ గోల్డ్ అవుట్‌ఫిట్‌లోని ఫోటోలు అయితే అల్టిమేట్ అని సోషల్ మీడియాలో తెగ కామెంట్లు చేస్తున్నారు. ఈ చిత్రాల్లో ఆమె స్టైలిష్‌గా, బ్యూటిఫుల్‌గా కనిపిస్తూ, తన గ్లామర్ కోణాన్ని సరికొత్తగా ఆవిష్కరించారు. ఈ ఫోటోలు ఇంటర్నెట్‌లో క్షణాల్లో వైరల్ అయ్యాయిఆమె ఫ్యాషన్ సెన్స్, ఆత్మవిశ్వాసం ఈ ఫోటోలలో స్పష్టంగా కనిపిస్తున్నాయి.


Priyanka Jawalkar's Latest Photos Are Absolutely Stunning

ప్రియాంక జవాల్కర్ ‘టాక్సీవాలా’ నుండి ‘మాడ్ స్క్వేర్’ వరకు విజయాల పరంపర

‘టాక్సీవాలా’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన జవాల్కర్, ఆ సినిమాలో తన అభినయంతో ఆకట్టుకున్నారు. ఆ తర్వాత ‘తిమ్మరుసు’, ‘ఎస్ఆర్ కల్యాణ మండపం’ వంటి విభిన్న కథాంశాల్లో నటించి తన నటనా ప్రతిభను చాటుకున్నారు. గతేడాది విడుదలైన ‘టిల్లు స్క్వేర్’ చిత్రంలో ఆమె ఒక అతిథి పాత్రలో మెరిసి, సినిమా విజయానికి తన వంతు సహకారం అందించారు.


Priyanka Jawalkar's Latest Photos Are Stunning

ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘మ్యాడ్ స్క్వేర్ (MAD Square)’ వెబ్ సిరీస్‌లో ప్రియాంక ఒక కీలక పాత్రలో నటించి ప్రశంసలు అందుకున్నారు. ఈ సిరీస్‌లో ఆమె ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్, స్క్రీన్ ప్రెజెన్స్ ఆకట్టుకున్నాయి. ‘మ్యాడ్స్క్వేర్’ విజయం ప్రియాంక కెరీర్‌కు మరో ప్లస్ పాయింట్‌గా మారింది. ఈ సిరీస్ సక్సెస్‌తో టాలీవుడ్ సినీ పరిశ్రమలో ఆమెకు డిమాండ్ మళ్లీ పెరిగింది.

ప్రియాంక జవాల్కర్ భవిష్యత్ ప్రణాళికలు

ప్రియాంక ప్రస్తుతం తన తదుపరి ప్రాజెక్టుల ఎంపికలో బిజీగా ఉన్నారు. కొన్ని ఆసక్తికరమైన కథలు, పాత్రల గురించి ఆమె చర్చలు జరుపుతున్నట్లు సినీ వర్గాల సమాచారం. సినిమాలతో పాటు సోషల్ మీడియాలో కూడా ప్రియాంక చాలా యాక్టివ్‌గా ఉంటారు. తన లేటెస్ట్ ఫోటోషూట్‌లు, ట్రిప్ అప్‌డేట్స్‌, లైఫ్‌స్టైల్ విషయాలను తన అభిమానులతో ఎప్పటికప్పుడూ పంచుకుంటూ వారిని అలరిస్తున్నారు. నటనకు, గ్లామర్‌కు సమ ప్రాధాన్యత ఇస్తున్న ప్రియాంక, త్వరలోనే మరిన్ని మంచి ప్రాజెక్టులతో తెరపై కనిపించాలని ఆమె అభిమానులు ఆశిస్తున్నారు. ప్రియాంక కెరీర్ త్వరలోనే మరింత ఊపందుకుంటుందని అంటున్నారు ఆమె ఫ్యాన్స్.

Share the post