సినీ నటి గౌరీ కిషన్ కు చేదు అనుభవం ఎదురైంది. ఆమె నటించిన తాజా చిత్రం ‘అదర్స్’ ప్రెస్ మీట్‌లో ఒక యూట్యూబర్ గౌరీని ఉద్దేశిస్తూ ‘మీ బరువు ఎంత‘ అని ప్రశ్నించడం ఈ వివాదానికి కారణమైంది. సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో తన బరువుకు సంబంధించిన ప్రశ్నను ధైర్యంగా తిప్పికొట్టిన తీరు సినీ వర్గాల్లో, సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

#Watch | உடல் எடையை பற்றி விமர்சித்து கேள்வி எழுப்பிய யூடியூபர்..
— Sun News (@sunnewstamil) November 6, 2025
– கொந்தளித்த நடிகை கெளரி கிஷன்#SunNews | #ActressGowriKishan | #MoviePressMeet pic.twitter.com/HzI7B8UkZZ
గౌరీ కిషన్ ఏమాత్రం తొణకకుండా, వెంటనే స్పందించింది. “నా బరువు గురించి తెలుసుకుని మీరు ఏం చేయబోతున్నారు? ఇది బాడీ షేమింగ్.. నా పాత్ర గురించి, నా నటన గురించి ఒక్క ప్రశ్న కూడా అడగకుండా, నా శరీరం గురించి అడగడం దేనికి?” అంటూ ఆమె ఎదురు ప్రశ్నించింది. తాను మాత్రమే అక్కడ ఉన్న ఏకైక మహిళను కాబట్టి ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నారని.. ఇది తన వృత్తికే అవమానమని ధీటుగా సమాధానం చెప్పింది. ప్రతి మహిళకు భిన్నమైన శరీరాకృతి ఉంటుందని, తన బరువు తన ప్రతిభకు కొలమానం కాదని ఆమె స్పష్టం చేసింది.

Also Read..| ఆటో నడుపుతూ డ్రైవర్ సరసాలు..! వీడియో వైరల్
ఈ ఘటనపై గౌరీ కిషన్ స్పందించిన తీరుకు సినీ ప్రముఖులు, నెటిజన్లు పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతున్నారు. సీనియర్ నటి ఖుష్బూ సుందర్, సింగర్ చిన్మయి శ్రీపాద వంటి వారు బహిరంగంగా గౌరీ ధైర్యాన్ని ప్రశంసిస్తున్నారు. మగవారిని వారి బరువు గురించి ఎప్పుడూ అడగరు.. మరి మహిళలను ఎందుకు అడుగుతున్నారని ప్రశ్నించారు. ఈ బాడీ షేమింగ్ సంస్కృతిని ఖండించారు. నటనను, ప్రతిభను గౌరవించకుండా, కేవలం శారీరక అంశాలపై దృష్టి పెట్టడం ఎంత వరకు సబబనే చర్చను గౌరీ కిషన్ లేవనెత్తింది. తనకు మద్దతు తెలిపిని ప్రతిఒక్కరికీ గౌరీకిషన్ ధన్యవాదాలు తెలుపుతూ ఓ నోట్ ను విడుదల చేశారు.
— Gouri G Kishan (@Gourayy) November 8, 2025









