నటి అదా శర్మ ఈ మధ్య తన కెరీర్ లో సినిమా పాత్రల ఎంపికల గురించి మనసు విప్పి మాట్లాడింది. ముఖ్యంగా, ‘ది కేరళ స్టోరీ’ (2023), ‘బస్తర్: ది నక్సల్ స్టోరీ’ (2024) వంటి సంచలనాత్మక చిత్రాలలో నటించిన తర్వాత తనకు ఎదురైన అనుభవాలను ఆమె పంచుకున్నారు. ఈ సినిమాలు విడుదలైనప్పుడు తనకు వ్యతిరేకంగా, అనుకూలంగా వచ్చిన రెస్పాన్స్ చాలా తీవ్రంగా ఉండేవని ఆమె తెలిపారు. సగం మంది నన్ను దేవతలా చూస్తూ రక్షించాలని చూస్తే, మిగతా సగం మంది నన్ను చంపాలనుకున్నారు అని తెలిపారు. ఈ రెండు వర్గాలు ఎంత ఉద్వేగంతో ఉన్నాయో చూసి నేను ఆశ్చర్యపోయాను” అని సరదాగా వ్యాఖ్యానించారు. తనకు కేటాయించిన పాత్ర కొంచెం డిఫరెంట్ గా లేకుంటే.. ఆపాత్ర చేయడం ఎందుకు అని అంటుంది అదా.

అదా శర్మ సినిమాలో కేవలం పాత్రను మాత్రమే కాకుండా, ఆ ప్రాజెక్ట్‌లో పనిచేసే టీమ్‌ను, వారు చెప్పిన మాటను బట్టి నిర్ణయాలు తీసుకుంటారట. ‘1920’తో తన సినీ ప్రయాణం మొదలైనప్పటి నుంచే తాను రొటీన్‌కు దూరంగా ఉన్నానని, ‘ది కేరళ స్టోరీ’ తన జీవిత గమనాన్ని పూర్తిగా మార్చేసిందని ఆమె అంటున్నారు. పాత్రలో ఎమోషనల్ డ్రామా, యాక్షన్ తనను తాను డీహైడ్రేట్ చేసుకునేంతగా ఏడ్వడానికి అవకాశం లేకపోతే తాను ఆసక్తి చూపనని చెప్పడం చూస్తుంటే నటన అంటే ఆమెకు ఎంత ఇష్టమో, ఎంత నిబద్ధత ఉందో అర్థమవుతుంది.
Also Read..| ఇకనుండి అలాంటి సినిమాలు చేయను: అను ఇమ్మాన్యుయేల్
తాజాగా ‘తుమ్‌కో మేరీ కసమ్’ (2025) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. దీనితో పాటు, లీగల్ థ్రిల్లర్ సిరీస్ ‘రీటా సన్యాల్ సీజన్ 2’ లో ఆమె మళ్లీ టైటిల్ రోల్ పోషించడానికి సిద్ధమవుతున్నారు. ఆమె తొలి హారర్ సినిమా ‘1920’కి సీక్వెల్‌తో పాటు మరో రెండు హారర్ ప్రాజెక్టులు, ఒక అంతర్జాతీయ చిత్రం కూడా ఆమె చేతిలో ఉన్నాయి. పాత్రకు సిద్ధమయ్యేటప్పుడు స్క్రిప్ట్ చదవడంతో పాటు, ఆమె సైకాలజీని అధ్యయనం చేయడం, వివిధ యాక్సెంట్లలో తనతో తాను మాట్లాడుకోవడం వంటి ప్రత్యేక పద్ధతులను పాటిస్తానని చెప్పడం ఆమె వర్క్ స్టైల్‌ను తెలియజేస్తుంది.








