Menu

  • Home
  • సినిమా
  • ‘నేను రెడీ’ తో హీరోయిన్ కావ్య థాపర్‌కు సాలిడ్ ఛాన్స్ !
Kavya Thapar first look released from Nenu Redy

‘నేను రెడీ’ తో హీరోయిన్ కావ్య థాపర్‌కు సాలిడ్ ఛాన్స్ !

యంగ్ అండ్ డైనమిక్ హీరోయిన్ కావ్య థాపర్, ఇప్పుడు సరికొత్త ప్రాజెక్ట్‌ ‘నేను రెడీ‘ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. గతేడాది ‘ఊరు పేరు భైరవకోన’, ‘డబుల్ ఇస్మార్ట్’ వంటి చిత్రాలతో ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయినా, ఈసారి మాత్రం ఆమె ఫుల్ జోష్‌తో రెడీ అవుతున్నారని తెలుస్తోంది.

nenu ready movie heroin kavya thapr

‘నేను రెడీ’ తో సాలిడ్ కమ్ బ్యాక్ !

హవీష్ హీరోగా, దర్శకుడు త్రినాధరావు నక్కిన రూపొందిస్తున్న కుటుంబ కథా చిత్రం ‘నేను రెడీ’. ఈ చిత్రంలో కావ్య థాపర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమా ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో ప్రేక్షకులను అలరించనుందని చిత్ర బృందం చెబుతోంది. ప్రముఖ నటులు వెన్నెల కిషోర్, అజయ్, హరి తేజ కీలక పాత్రలు పోషిస్తుండగా, నిఖిల కోనేరు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

‘నేను రెడీ’ సినిమా నుంచి ఇప్పటివరకు పెద్దగా అప్డేట్స్ రాలేదు. కానీ, కావ్యా థాపర్ పుట్టినరోజు సందర్భంగా, మేకర్స్ ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసి అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో కావ్యా థాపర్ లుక్ ఆడియన్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

గతంలో ‘ఏక్ మినీ కథ’ మరియు ‘బిచ్చగాడు 2’ వంటి చిత్రాలలో తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్న కావ్యా, ఈ కొత్త సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక బలమైన స్థానాన్ని ఏర్పరచుకోవాలని చూస్తున్నారు. ‘నేను రెడీ’ ఆమె కెరీర్‌లో ఒక టర్నింగ్ పాయింట్ అవుతుందని సినీ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.

Share the post