Menu

actress shwetha menon

నటి శ్వేతా మేనన్‌పై కేసు నమోదు

ప్రముఖ నటి శ్వేతా మేనన్‌ పై కేరళ పోలీసులు కేసు నమోదు చేశారు. తన ఆర్థిక ప్రయోజనాల కోసం అశ్లీల, అభ్యంతరకరమైన కంటెంట్‌ను ఉపయోగించారని ఆరోపిస్తూ మార్టిన్ మేనచెరి అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఈ చర్య తీసుకున్నారు. కొచ్చి సెంట్రల్ పోలీస్ స్టేషన్‌లో ఈ కేసు నమోదైంది. ఫిర్యాదుదారుడు కోర్టును ఆశ్రయించడంతో, కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

ఫిర్యాదులో, మార్టిన్ మేనచెరి శ్వేతా మేనన్ నటించిన ‘రతినిర్వేదం’, ‘పలేరి మాణిక్యం’, ‘కలిమన్ను’ వంటి చిత్రాలలోని కొన్ని సన్నివేశాలను ప్రస్తావించారు. ఆమె ఈ చిత్రాలలోని అభ్యంతరకరమైన సన్నివేశాలను సోషల్ మీడియా, అడల్ట్ వెబ్‌సైట్‌లలో ప్రచారం చేసి డబ్బు సంపాదించారని ఆరోపించారు. ఈ కేసు నమోదైన సమయంపై సినీ వర్గాల్లో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం శ్వేతా మేనన్ ‘అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్‘ (AMMA) అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న తరుణంలో ఆమెపై ఈ ఫిర్యాదు రావడం గమనార్హం.

Also Read…| ప్రియాంక జవాల్కర్ గ్లామర్ తళుకులు.. సోషల్ మీడియాలో వైరల్ !

ఈ కేసుపై ఇప్పటివరకు శ్వేతా మేనన్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.శ్వేతా మేనన్ మలయాళ, తమిళ, తెలుగు చిత్రాలలో నటించారు. ఆమె టాలీవుడ్‌లో నాగార్జున నటించిన ‘రాజన్న’ చిత్రంలో కూడా కనిపించారు.

Share the post

Also Read..