అభివృద్ధి వికేంద్రీకరణ కోసం రాష్ట్రానికి మూడు రాజధానులు అవసరమని 2019-2024 లో అధికారంలో ఉన్నప్పుడు వైఎస్సార్సీపీ బలంగా వాదించింది. విశాఖపట్నం, అమరావతి, కర్నూలును రాజధానులు చేస్తామని తేల్చి చెప్పింది. అయితే 3 రాజధానులు గతంలో కార్యరూపం దాల్చలేదు. అయితే, 3 రాజధానులు అప్పటి మాట అని.. ప్రస్తుతం తమ విధానం ఏంటో చర్చించుకొని చెప్తామని వైఎస్సీర్సీపీ సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ అన్నారు. దీంతో జగన్ పార్టీ మూడు రాజధానుల విషయంలో యూటర్న్ తీసుకుందా? అనే చర్చ రాజకీయవర్గాల్లో జోరుగా సాగుతోంది.