అనాథాశ్రమంలో శనివారం రాత్రి సమోసాలు, సాంబారుతో భోజనం చేసిన చిన్నారులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర విరేచనాలు, వాంతులు రావడంతో వారిని స్వగ్రామాలకు పంపగా.. సిద్ధ (6), పి. జాషువా (6), గంబెల్ల భవాని (9) ముగ్గురు చిన్నారులు మృతి చెందారు.ఉమ్మడి విశాఖపట్నం జిల్లా కోటవురట్ల మండలం కైలాస పట్నంలోని ఓ అనాథాశ్రమంలో ఈ విషాదం జరిగింది. మరో 24 మందికి అనకాపల్లి, నర్సిపట్నం ప్రభుత్వ ఆసుపత్రులలో చికిత్స అందిస్తున్నారు. నర్సీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో ఏడుగురు, అనకాపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో 17 మంది విద్యార్థులు ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.