ఏపీలో స్పష్టమైన ఆధిక్యం దిశగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి దూసుకెళ్తుంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల కౌంటింగ్ నుండే ఆధిక్యత కనబరుస్తున్నారు. 150కి పైగా సీట్లలో కూటమి అభ్యర్ధులు ఆధిక్యత కనబరుస్తున్నారు. జనసేన పోటీ చేసిన 21 స్థానాల్లో 19 చోట్ల ముందంజలో ఉన్నారు. అధికార వైసీపీ కేవలం 20 చోట్ల మాత్రమే ఆధిక్యంలో ఉన్నారు. మరోవైపు లోక్ సభ ఎన్నికల్లో కూడా 25 స్థానాలకుగాను 20 సీట్లకు పైగా చోట్ల కూటమి ముందంజలో కొనసాగుతోంది.