శ్రీ సత్యసాయి జిల్లా: టీడీపీ నుండి పెనుగొండ ఎమ్మెల్యేగా తొలిసారి గెలిచిన సవితను మంత్రివర్గంలోకి తీసుకున్నారు. సవిత పూర్తిపేరు సంజీవరెడ్డిగారి సవిత. వైసీపీ అభ్యర్థి, మంత్రి ఉష శ్రీ చరణ్ పై సవిత విజయం సాధించారు. కురుబ సామాజిక వర్గానికి చెందిన సవిత బీసీ కోటాలో మంత్రివర్గంలో చోటు సంపాదించారు. టీడీపీలో క్రియాశీల కార్యకర్తగా 2015 నుండి ఆమె పనిచేస్తున్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ కురుబ సహకార ఆర్థిక కార్పోరేషన్ చైర్మెన్ గా కూడా పనిచేశారు.