ప్రముఖ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ తన వ్యూహం సినిమా ప్రమోషన్ కోసం సోషల్ మీడియాలో చంద్రబాబు నాయుడు, పవణ్ కళ్యాణ్ లపై అనుచిత పోస్టులు చేశారని.. ఆర్జీవీపై చర్యలు తీసుకోవాలని ఏపీలోని ఒంగోలు జిల్లాల్లో కేసు నమోదయిన విషయం తెలిసిందే. ఆయన రెండవసారి కూడా ఒంగోలు పోలీసుల విచారణకు హాజరు కాలేదు. దీంతో ఒంగోలు పోలీసలు సోమవారం ఉదయం హైదరాబాద్ లోని రాంగోపాల్ వర్మ ఇంటికి వచ్చారు. ఉదయం నుండి కూడా ఆయన ఇంటి వద్ద హైడ్రామా చోటుచేసుకుంది. ఆయనను అరెస్ట చేస్తారని ప్రచారం సాగింది. అయితే, ఆర్జీవి ఇంట్లో లేరని నిర్దారించున్న పోలీసులు అక్కడినుండి వెనుదిరిగారు.
అయితే, ఆర్జీవి ఎక్కడికీ పారిపోలేదని ఆయన తరపు లాయర్ బాల తెలిపారు. తన పనుల్లో బిజీగా ఉన్నారని తెలిపారు. అయితే ఎక్కడ ఉన్నది తనకు తెలియదని అన్నారు. ఆయన ఈకేసు విషయంలో ఫిజికల్ గా విచారణకు హాజరు కాలేరని.. వర్చువల్ గా హాజరు అవుతాడని అన్నారు. దానికోసం రెండు వారాల గడువు కావాలని పోలీసులను కోరామని తెలిపారు. అయిదే ఇంకా పోలీసుల నుండి దీనిపై ఎంలాంటి రిప్లై రాలేదన్నారు. కానీ పోలీసులు మాత్రం వర్మను స్టేషన్ కు తీసుకువెళ్లి విచారించేందుకే చూస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు క్వాష్ పిటిషన్, ముందస్తు బెయిల్ పిటిషన్ కోర్టులో పెండింగ్ లో ఉన్నాయని ఆర్జీవీ తరపు లాయర్ అంటున్నారు.