ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన తరువాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తొలిసారి తన అన్నయ్య చిరంజీవి (chiranjeevi) ఇంటికి వెళ్లారు. అంతకు ముందే చిరంజీవి కుటుంబసబ్యులు అందరూ అక్కడికి చేరుకున్నారు. పవన్ రాగానే ఆయనకు పూల వర్షంతో గ్రాండ్ వెల్ కం చెప్పారు. ఇంట్లోకి హారతితో ఆహ్వానం పలికారు. అనంతరం తన అన్నయ్య, అమ్మ, వదినలకు పవన్ పాదాభివందనం చేసి వారి ఆశీస్సులు తీసుకున్నారు. చిరంజీవి భారీ గులాబీ గజమాలతో పవన్ మెడలో వేసి ఆలింగనం చేసుకుని అభినందించారు. కుటుంబ సబ్యలందరూ కేక్ కట్ చేసి జనసేనానికి శుభాకాంక్షలు తెలిపారు.
Mega Blessings to Game Changer @PawanKalyan #KutamiTsunami #GameChangerPK pic.twitter.com/DoIwVQpPno
— JanaSena Party (@JanaSenaParty) June 6, 2024