దాతృత్వానికి చిరంజీవి చేసిన అసమానమైన సహకారాన్ని, ఇతరుల పట్ల అతని అచంచలమైన కరుణను మెగాస్టార్ చిరంజీవి (megastar chiranjeevi) పుట్టినరోజు సందర్భంగా ఆయన సోదరుడు, ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kaalyan) ఎమోషనల్ నోట్ విడుదల చేశారు. చిరంజీవి ఆపద్భాందవుడు అని కొనియాడారు. ఆపత్కాలంలో చిరంజీవి ఎందరికో సహాయం చేయండం తనకు తెలుసని పవర్ స్టార్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికలకు ముందు చిరంజీవి జనసేన పార్టీకి (janasena party) ఐదు కోట్ల విరాళం ఇచ్చి నైతిక బలాన్ని అందివ్వడం వల్లే జనసేన అపూర్వవిజయం సాధించిందని అన్నారు. ఆయన చిరాయిష్షుతో నిండు నూరేళ్లు జీవించాలని పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
