ముంబాయి నటి కాదంబరి జెత్వానీపై వేధింపుల వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముగ్గురు ఐపీఎస్ అధికారులపై సస్పెన్షన్ వేటు వేసిన విషయం తెలిసిందే. PSR ఆంజనేయులు, విశాల్ గున్నీ, కాంతిరాణా టాటాలను సస్పెండ్ చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంచలనం నిర్ణయం తీసుకున్నారు. ఈ సస్పెన్షన్ పై అధికార పార్టీ ఎమ్మెల్యే రఘురామకృష్ణ రాజు స్పందించారు. రాష్ట్రంలో ఒకేసారి ముగ్గురు ఐపీఎస్ ల సస్పెన్షన్ చరిత్రక నిర్ణయమని పేర్కొన్నారు. పూర్తిస్థాయి విచారణ జరిపిన తరువాతనే వారిని సస్పెండ్ చేశారని ఆయన వెల్లడించారు. ఏపీ సీఎం బాబు మాటల వ్యక్తి కాదని, చేతల వ్యక్తి అని మరోసారి రుజువైందని రఘురామకృష్ణ రాజు తెలిపారు.