జనసేన యూట్యూబ్ చానల్ హాక్ అయింది. జనసేన యూ ట్యూబ్ చానెల్ నుండి వేరే ఇతర కార్యక్రమాలను హ్యాకర్లు స్ట్రీమ్ చేశారు. చానెల్ పేరు కూడా మార్చి, చాలా వీడియోలను ప్రైవేట్ లో ఉంచారు. విదేశాల నుండి చానల్ ను హ్యాక్ చేశారని టెక్నికల్ టీమ్ గుర్తించింది. వెంటనే యూట్యూబ్ కు ఫిర్యాదు చేశారు. రాజకీయ కుట్రలో భాగంగానే తమ సోషల్ మీడియా అకౌంట్ ను హ్యక్ చేశారని జనసేన పార్టీ ఆరోపిస్తోంది. ఎన్నికల వేళ పార్టీ అఫిషియల్ చానల్ హాక్ కావడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది