ప్రముఖ నటుడు, వైఎస్సార్సీసీ మాజీ నేత పోసాని కృష్ణ మురళి (Posani Krishna Murali) ని రాయచోటి పోలీసులు అరెస్ట్ చేశారు. ఓబులవారి పల్లి పోలిస్ స్టేషన్ లో గతంలో పోసానిపై కేసు నమోదు అయింది. హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో ఆయనను ఏపీ పోలీసులు ఆరెస్ట్ చేశారు. గతంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ప అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆయనపై ఏపీలోని పలు ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయి. కులాల పేరుతో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని 196, 353(2), 111 రెడ్ విత్ 3(5) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.