విజయవాడ ఇంద్రకీలాద్రిపై దేవీ శరన్నవరాత్రుల ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. దుర్గమ్మ భక్తులకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. దసరా నవరాత్రులు కావడంతో భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఆదివారం శ్రీలలితా త్రిపురసుందరీ దేవి అలంకారంలో అమ్మవారు దర్శనం ఇస్తున్నారు. తెల్లవారుఘామునుంచే భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. కొలోమీటర్ మేర క్యూలైన్ లో భక్తులు దర్శనానికి తరలివచ్చారు. అన్నప్రసాదం, లడ్డూ ప్రసాదాలు అందుబాటులో ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. వృద్ధులకు, దివ్యాంగులకు ప్రత్యేక వాహనంతో పాటు వీల్ చైర్ సౌకర్యం అందుబాటులో ఉంచారు. భక్తుల సౌకర్యార్థం ఎక్కడికక్కడ లగేజ్ కౌంటర్లు ఏర్పాటు చేశారు. త్రాగునీటికి ఇబ్బందులు లేకుండా విజయవాడ నగరపాలక సంస్థ ప్రత్యేకంగా ఏర్పాట్లను చేసింది.