...

తిరుమల తిరుపతి నుండే ప్రక్షాళన మొదలు: ముఖ్యమంత్రి చంద్రబాబు

రాష్ట్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం నుండే ప్రక్షాళన మొదలుపెడతామని… తిరుమలలో ఓం నమో వెంకటేశాయా, గోవింద నామస్మరణ తప్ప మరో నినాదమే వినపడకుండా చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. గత పాలకుల హయాంలో తిరుమల కొండపైకి గంజాయితో పాటు నాన్ వెజ్, మద్యం తీసుకొచ్చి పవిత్రమైన తిరుమలను అపవిత్రం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులతో కలిసి గురువారం ఉదయం వెంకటేశ్వరస్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం తిరుచానారు అమ్మవారిని కూడా దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అంతకముందు కొండపైన మీడియాతో చంద్రబాబు నాయుడు మాట్లాడారు.‘‘మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు చారిత్రాత్మక తీర్పునిచ్చారు. 93 శాతం స్ట్రైక్ రేట్ ఎప్పుడూ దేశ, రాష్ట్ర చరిత్రలో రాలేదు. నేను ఏ సంకల్పం తీసుకన్నా వెంకటేశ్వరస్వామిని తలచుకుని ముందకు వెళ్తా. చిన్నతనంలో కూడా దేవుడికి మొక్కలు తీర్చుకోవడానికి నడిచివచ్చేవాళ్లం. ఆయన ఆశీస్సులతో అంచలంచలుగా నేను ఎదగి, రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వడం, దేశ రాజకీయాల్లో పాత్ర పోషించాను. 2003లో వెంకటేశ్వరస్వామికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి వస్తుంటే క్లేమోర్ మైన్స్ పేలాయి…అప్పుడు ఆ ఏడుకొండలవారే నన్ను బతికించారు. ఆయన సేవకు వచ్చి చనిపోతే అపవాదు వస్తుందనో, నా వల్ల ఈ రాష్ట్రానికి..తెలుగుజాతికి ఇంకా మంచి చేయాలన్న ఆశీస్సులతోనో ప్రాణభిక్ష పెట్టారు. తిరుపతిలో అన్నదాన కార్యక్రమాన్ని ఎన్టీఆర్ ప్రవేశపెట్టారు. నా మనవడు దేవాన్ష్ ప్రతి పుట్టినరోజు నాడు అన్నదానానికి విరాళం అందిస్తున్నా. నేను ఎక్కువగా పూజలు చేయకపోయినా పవిత్రమైన మనసుతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని దేవుడ్ని ఒకటే కోరుకుంటా.’’ అని సీఎం చంద్రబాబు అన్నారు.

తెలుగుజాతి అత్యున్నత స్థాయిలో ఉండాలి

ప్రపంచంలోనే భారతదేశం అగ్రస్థానంలో ఉండాలి..అందులో తెలుగుజాతి అగ్రస్థానం ఉండాలి. సంపద సృష్టించడం ఎంత ముఖ్యమో..సృష్టించిన సంపద పేదవారికి అందడం అంతే ముఖ్యం. సంపద కొంతమందికే పరిమితం కాకుండా పేదరికం లేని సమాజంగా మారాలి. పేదరికం లేని రాష్ట్రం, జిల్లాగా మారినప్పుడే మెరుగైన జీవన ప్రమాణాలతో ప్రజలు ముందుకెళ్తారు. ప్రజల మధ్య ఆర్థిక అసమానతలు తగ్గించాలి..ఇది ప్రభుత్వం తీసుకొచ్చే విధానాలతో సాధ్యం అవుతుంది. 1995లో సీబీఎన్ పాలన ప్రారంభమైంది. అంతక ముందు సచివాలయానికే పరిమితమైన పరిపాలన ప్రజల మధ్యన జరిగింది. ఆరోజు చేసిన అభివృద్ధితో వచ్చిన ఫలాలు చూసి ప్రపంచాధినేతలంతా హైదరాబాద్ రావడానికి ప్రయత్నించారు. జరిగిన మంచిని ప్రపంచమంతా గుర్తిచ్చింది…ఆ గుర్తింపునే మేము తీసుకొచ్చాం. దేశానికి అతిపెద్ద సంపద కుటుంబ వ్యవస్థ. కుటుంబ వ్యవస్థలో ఎనర్జీ రీఛార్జ్ తో పాటు, భద్రత, ఆనందం, బాధలను పంచుకునే భాగస్వాములుగా ఉంటారు. నేను జైల్లో ఉన్నప్పుడు నాకు అండగా కుటుంబం నిలబడింది. జైల్లో కలవడానికి కుటుంబ సభ్యులకు వారానికి రెండు సార్లు మాత్రమే కలవనిచ్చారు. భారతదేశంలోని కుటుంబ వ్యవస్థ ప్రపంచానికే ఆదర్శం. వెంకటేశ్వరస్వామి కలియుగ దేవుడు…మా ఇంటి ఇలవేల్పు దైవం. బ్రహ్మోత్సవాల సమయంలో ఒక్కపొద్దుతో నిష్టగా పూజలు చేసిన తర్వాతే మధ్యాహ్నం భోజనం చేసేవాళ్లం…ఈ సంస్కృతి చిత్తూరు జిల్లాలో చాలా కుటుంబాల్లో ఉండేది. కలియుగం దైవం వెంకటేశ్వరస్వామిని ఒక్కసారైనా దర్శించుకోవాలని అనుకుంటారు. ఎన్నిసార్లు వచ్చినా మళ్లీ రావాలని కోరుకుంటారు. ప్రపంచంలో మనదేశం ముందుండాలి…అందులో తెలుగుజాతి అగ్రస్థానంలో ఉండాలి’’ అని సీఎం చంద్రబాబు అన్నారు.

పేదరికం లేని సమాజాన్ని స్థాపించేందుకు శక్తినివ్వాలని కోరుకున్నా

‘‘పేదరికం లేని సమాజాన్ని స్థాపించేందుకు నాకు శక్తిసామర్థ్యాన్ని ఇవ్వాలని వెంకటేశ్వరస్వామిని కోరుకున్నా. సంపద లేనప్పుడు…సృష్టించడం కోసం రెండవ తరం ఆర్థిక సంస్కరణలు నేను తీసుకొచ్చాను. సంస్కరణలతో బ్రహ్మండమైన రోడ్లు వచ్చాయి. దేశంలో మొదటి నేషనల్ హైవే నెల్లూరు-చెన్నైకు ఏర్పాటైంది. అది విజయవంతమవడంతో నాటి ప్రధాని వాజ్ పేయ్ దేశమంతా అమలు చేశారు..ఈ విధానం జిల్లాలకు కూడా విస్తరించింది. ఫోన్ అన్నం పెడుతుందా అన్నారు…కానీ ఇప్పుడు నిత్యవసర వస్తువైంది…ఆయుధమైంది. వర్చువల్ వర్క్ కు కూడా పనికొస్తోంది.’’ అని సీఎం చంద్రబాబు అన్నారు.

నేను ఒక్కరి వాడిని కాదు…అందరి వాడిని

‘‘పరదాలు కట్టడం అధికారులకు అలవాటైంది. జనాలు కలవకుండా కర్ఫ్యూ పెట్టారు..ఇలాంటి సంస్కృతి చూస్తే బాధేస్తోంది. పాలనలో కక్ష సాధింపు చర్యలు ఉండకూడదు…కానీ తప్పు చేసిన వారికి శిక్ష వేయకపోతే దేవుడు కూడా సహకరించరు. మంచివారిని కాపాడుకోవాలి…చెడు వ్యక్తులను శిక్షించి సమాజాన్ని కాపాడాలి. నా జీవితంలో నా కుటుంబానికి ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదు. 35 ఏళ్ల క్రితమే చిన్న వ్యాపారం స్థాపించి పెట్టి నా కుటుంబం రాజకీయాలపై ఆధారపడకుండా చేశాను. నా జీవితంలో కుటుంబానికి ఎక్కువ సమయం కూడా ఇవ్వలేదు. ఇప్పుడు కుటుంబానికి సమయం ఇస్తా. ఆదరించిన ప్రజలకు రుణపడి ఉంటా. మొన్నటి ఎన్నికల్లో ప్రజలను భయపెట్టారు. నాకు ప్రజలపై అపారమైన నమ్మకం, గౌరవం ఉంది. ప్రజలు గెలవాలి…రాష్ట్రం నిలవాలి…తెలుగువారు ఎక్కడున్నా తమ బాధ్యత నిర్వర్తించాలని కోరుతున్నా. ప్రజలు గెలిచారు…రాష్ట్రాన్ని నిలబెట్టారు…ప్రజలను గౌరవించాల్సిన బాధ్యత మాపై ఉంది. నేను ఏ ఒక్కరి వ్యక్తిని కాదు…అందరి వాడిని. ఐదుకోట్ల ప్రజలకు చెందిన వ్యక్తిని.’’ అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

ఐదేళ్ల విధ్వంసంతో 30 ఏళ్లు వెనక్కి

కొందరు మీడియా ప్రతినిధులు కూడా ప్రజాస్వామ్యం కోసం పోరాడి కోర్టుల చుట్టూ తిరిగారు. వాస్తవాలు చెప్పలేని దుస్థితి అనుభవించారు. నాయకులు, కార్యకర్తలు విపరీతమైన క్షోభ అనుభవించారు. శనివారం వస్తే ఎప్పుడు ఎవరి ఇంటిపైకి ప్రొక్లెయిన్ వస్తుందో…41ఏ నోటీసులిస్తారో భయపడే పరిస్థితి కల్పించారు. కానీ ఇప్పుడు చెట్లు నరకడం, పరదాలు కట్టడం, ప్రొక్లెయిన్ పంపడాలు ఉండవు. రాష్ట్రంలో ఇక ప్రజా పాలన ప్రారంభమైంది. ఉద్యోగులు కూడా ఇబ్బంది పడ్డారు. ప్రజలు కూడా అన్యాయం జరిగిందని చెప్పుకోవడానికి ఇబ్బంది పడ్డారు. ప్రతి ఒక్కరికీ న్యాయం జరుగుతుందని నాపై నమ్మకం పెట్టుకున్నారు…ఆ నమ్మకాన్ని నేను నిరూపించుకోవాలి. ఐదేళ్ల విధ్వంసంతో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి వెళ్లింది. తిరిగి పునర్నిర్మించుకోవాలి. పాలనలో రాగద్వేషాలకు తావు లేదు. ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించి ప్రభుత్వంలో భాగం కావాలి. 2047 నాటికి దేశం ప్రపంచంలోనే నెంబర్-1 గా ఉంటుంది. ఏ దేశానికి వెళ్లినా భారతీయులు ఖచ్చితంగా ఉంటారు…అందులో తెలుగువారు ఎక్కువగా ఉంటారు. టెక్నాలజీ, ఐటీని అందిపుచ్చుకుని అంచలంచలుగా ఎదిగి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దాకా వచ్చాం. రాబోయే రోజుల్లో కార్పొరేట్ గవర్నెన్స్, పబ్లిక్ గవర్నెన్స్ లో భారతీయులు రాణిస్తారు. సర్వీస్ ఎకానమీలో భారతీయుల సేవలు ప్రపంచానికి అవసరం ఉంటుంది. 2047 నాటికి నాటికి తెలుగుజాతి నెంబర్-1గా ఉంటుంది.’’ అని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు.

తెలుగు జాతికి పెద్దగా ఉంటా

‘‘రాష్ట్రంలో పేదరిక నిర్మూలన చేయాల్సి ఉంది. ఆంధ్రపదేశ్ తో పాటు తెలంగాణ కూడా బాగుండాలి. తెలుగుజాతికి నేను పెద్దగా ఉంటా. విభజన జరిగినప్పుడు హైదరాబాద్ తెలంగాణకు వెళ్లింది…కష్టపడి ఏపీకి మంచి నగరం నిర్మించి అభివృద్ధి చేసి రుణం తీర్చుకోవాలనుకున్నా. అందుకే అమరావతి, పోలవరం ప్రారంభిస్తే అవి రెండూ గత ప్రభుత్వంలో పడకేశాయి, అమరావతి విధ్వంసం పాలైంది…ప్రతి ఎకరాకు నీళ్లిచ్చే జీవనాడి పోలవార్ని గోదావరిలో కలిపారు, ప్రజలు, ఎన్డీయే కార్యకర్తల ఆరోగ్యంతో బాగుండాలి…నేను అనుకున్న సంకల్పం ముందుకు వెళ్లేలా దేవుడు ఆశీర్వదించాలి. తిరుమల పవిత్రమైన దివ్యక్షేత్రం…ఈ దివ్య క్షేత్రాన్ని అపవిత్రం చేయడం భావ్యం కాదు. ప్రసాదాల నాణ్యత లేకుండా, శుభ్రం లేకుండా తిలోదకాలు తెచ్చారు. ఓం నమో వెంకటేశాయా…గోవింద నామస్మరణ తప్ప మరో మరో నినాదం కొండపై ఉండకూడదు. మొత్తం ప్రక్షాళన చేసి ప్రపంచమంతా అభినందించేలా టీటీడీని తీర్చిదిద్దుతాం. దొంగలే దొంగ దొంగ అంటూ అటెన్షన్ డైవర్షన్ చేస్తున్నారు…అలాంటి వారికి నేను సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. సంఘవిద్రోహ శక్తులు, రౌడీలు లేకుండా చేశాను. రాజకీయ ముసుగులో నేరస్తులు ఉండకూడదు. నేరాలు చేసినా తప్పించుకోలేరు.’’ అని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.

Share the post

Hot this week

మంత్రుల పర్యటనలుంటే.. మా నాయకుల హౌజ్అరెస్ట్ లు ఏంది? : హరీష్ రావు

మంత్రులు నర్సంపేటలో మెడికల్ కాలేజీ, జనరల్ ఆసుపత్రి ప్రారంభిస్తున్నారన్న కారణంతో బీఆర్ఎస్...

జానీమాస్టర్ అరెస్ట్.. బెంగుళూరులో అదుపులోకి తీసుకున్న పోలీసులు

కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అరెస్ట్ అయ్యారు. సైబరాబాద్ SOT పోలీసులు బెంగుళూరులో...

జమిలి ఎన్నికలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. కేబినెట్ ఆమోదం

కేంద్ర కేబినెట్ లో కీలక పరిణామం చోటుచేసుకోనుంది. ఇప్పటి వరకు ప్రతిపాదనలు,...

సీఎం సహాయ నిధికి కుమారి ఆంటీ 50 వేల విరాళం

తెలంగాణలో ఇటీవల వరదల వల్ల కొంతమంది నిరాశ్రయులయ్యారు. చాలా వరకు రైతులు...

ఉద్యోగులకు వరంగా మారనున్న EHS కొత్త ప్ర‌తిపాద‌న‌: ల‌చ్చిరెడ్డి

తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగులు, ఫెన్షన‌ర్లు, వారిపై ఆధార‌ప‌డ్డ కుటుంబ‌ స‌భ్యుల కోసం...

Topics

మంత్రుల పర్యటనలుంటే.. మా నాయకుల హౌజ్అరెస్ట్ లు ఏంది? : హరీష్ రావు

మంత్రులు నర్సంపేటలో మెడికల్ కాలేజీ, జనరల్ ఆసుపత్రి ప్రారంభిస్తున్నారన్న కారణంతో బీఆర్ఎస్...

జానీమాస్టర్ అరెస్ట్.. బెంగుళూరులో అదుపులోకి తీసుకున్న పోలీసులు

కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అరెస్ట్ అయ్యారు. సైబరాబాద్ SOT పోలీసులు బెంగుళూరులో...

జమిలి ఎన్నికలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. కేబినెట్ ఆమోదం

కేంద్ర కేబినెట్ లో కీలక పరిణామం చోటుచేసుకోనుంది. ఇప్పటి వరకు ప్రతిపాదనలు,...

సీఎం సహాయ నిధికి కుమారి ఆంటీ 50 వేల విరాళం

తెలంగాణలో ఇటీవల వరదల వల్ల కొంతమంది నిరాశ్రయులయ్యారు. చాలా వరకు రైతులు...

ఉద్యోగులకు వరంగా మారనున్న EHS కొత్త ప్ర‌తిపాద‌న‌: ల‌చ్చిరెడ్డి

తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగులు, ఫెన్షన‌ర్లు, వారిపై ఆధార‌ప‌డ్డ కుటుంబ‌ స‌భ్యుల కోసం...

ప్రభుత్వాస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి జూప‌ల్లి.. వైద్యులపై ఆగ్రహం

కొల్లాపూర్ లోని ప్ర‌భుత్వ ఆసుపత్రిని ఎక్సైజ్, ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక శాఖామంత్రి జూప‌ల్లి...

గణేష్ నిమజ్జనం విజయవంతం: GHMC కమీషనర్ ఆమ్రపాలి

హైదరాబాద్ నగర వ్యాప్తంగా గణేష్ నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు...

బీఆర్ఎస్ పార్టీ ఆఫీసును 15 రోజుల్లోగా కూల్చేయండి: హైకోర్టు

బీఆర్ఎస్ పార్టీకి హైకోర్టులో బిగ్ షాక్ తగిలింది. అనుమతులు లేకుండా నిర్మించిన...
spot_img

Related Articles

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.