ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకి ఎట్టకేలకు బెయిలు మంజూరు అయింది. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్టయి.. 52 రోజులు జైలులో ఉన్న చంద్రబాబు మంగళవారం జైలు నుండి విడుదల అయ్యారు. రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు చంద్రబాబుకు స్వాగతం పలికారు. జైలు పరిసరాల వద్ద అభిమానులతో సందడి వాతవరణం నెలకొంది. వారిని చూసి చంద్రబాబు భావోద్వేగానికి గురయ్యారు. తనకోసం అండగా నిలిచిన అభిమానులందరికి కృతజ్ఙతలు తెలిపారు. జనసేన పార్టీకి, పవన్ కళ్యాణ్ కు ప్రత్యేకంగా కృతజ్ఙతలు తెలిపారు. అక్కడినుండి అమరావతి బయలుదేరి వెళ్లారు.