ఏపీలో కూటమి అభ్యర్థుల హవా కొనసాగుతోన్న తరుణంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 9వ తేదీన అమరావతిలో టిడిపి అధినేత చంద్రబాబునాయుడు నాలుగోసారి సిఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. నాలుగోసారి సీఎం గా ప్రమాణస్వీకారానికి ముహూర్తం వివరాలు త్వరలోనే వెళ్లడిస్తామని పార్టీ నేతలు చెప్తున్నారు. టీడీపీ కార్యాలయం వద్ద సీఎం సీఎం అంటూ కార్యకర్తలు నినాదాలతో హోరెత్తిస్తున్నారు.