అయోధ్య ప్రాణప్రతిష్ట మహోత్సవానికి తెలుగుదేశం అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకి ఆహ్వానం అందింది. ఈనెల 22న రాముని ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి రావాలని శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రతినిధులు చంద్రబాబుకు ఆహ్వానం పంపారు. దేశవ్యాప్తంగా ఉన్న ముఖ్యమంత్రులకు, ప్రతిపక్ష నేతలకు, ఇతర రంగాల ప్రముఖులకు రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రతినిధులు ఆహ్వానాలు పంపుతున్నారు.