ప్రకాశం బ్యారేజ్ (Prakasam Barrage) వద్ద బోట్ల తొలగింపు పనులు నిరాటంకంగా కొనసాగుతున్నాయి. బోట్లను బయటకు తీసుకు వచ్చేందుకు అధికారులు, డైవింగ్ టీమ్ ఎంత కృషి చేస్తున్నా ఆశించిన స్థాయిలో ఫలితం రావడం లేదు. అందుకే బోట్లను బయటకు తీసుకువచ్చేందుకు అందులో నిపుణుడైన అబ్బులు బృందాన్ని ప్రత్యేకంగా కాకినాడ నుంచి అధికారులు రప్పించారు. నేడు ఆరో రోజు పనులు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు కేవలం 20 మీ. మాత్రమే బోట్లు అక్కడినుండి కదిలించగలిగారు. అవి పూర్తిగా ఇసుకలో కూరుకు పోవడంతో వాటిని వెలికితీసే పనులు కష్టతరంగా మారాయని అంటున్నారు. ఇటీవలి వరదల్లో బోట్లు ఎగువనుండి బ్యారేజీలోకి కొట్టుక రావడంతో బ్యారేజీ గేట్లు డ్యామేజ్ అయ్యాయని అధికారులు తెలిపిన విషయం తెలిసిందే. ఇందులో ఓ రాజకీయ పార్టీ కుట్రకోణం ఉందని ప్రభుత్వం అనుమానిస్తుంది. దీనిని ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని ముందుకు వెళ్తుంది.