నటి కాదంబరి జెత్వానీ (Kadambari Jethwani)పై వేధింపుల కేసులో ఏపీ ప్రభుత్వానికి డీజీపీ సమర్పించి నివేదికలో ముగ్గురు ఐపీఎస్ ల పాత్ర ఉన్నట్లు స్పష్టం చేసింది. ఈనివేదిక ఆధారంగా మాజీ ఇంటిలిజెన్స్ చీఫ్ PSR ఆంజనేయులు, కాంతి రాణా టాటా, విశాల్ గున్నీలపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ అధికారుల పాత్రపై ఏపీ ప్రభుత్వం ఇప్పటికే డీవోపీటీకి సమాచారం అందించింది. ఏపీ హోంశాఖ సస్పెన్షన్ అంశాన్ని కూడా ప్రస్తావించినట్టు సమాచారం. ఏసీపీ హనుమంతరావు, సీఐ సత్యనారాయణలపై సస్పెన్షన్ వేటు వేసింది. తాజాగా, డీజీపీ నివేదిక నేపథ్యంలో ముగ్గురు ఐపీఎస్ లపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది.
అక్రమ నిర్బంధం, వేధింపులపై కాదంబరి జెత్వానీ ఏపీ పోలీసులకు ఫిర్యాదు చేసి, ముగ్గురు ఐపీఎస్ అధికారులపై ఆమె తీవ్ర ఆరోపణలు చేసినట్టు చేసింది. అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ PSR ఆంజనేయులు ఆధ్వర్యంలో తనను అక్రమంగా నిర్వంధించారని, జెత్వానీ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. డీజీపీ నివేదిక తర్వాత ఐపీఎస్ ల సస్పెన్షన్ ఫైల్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతకం చేశారు. అధికారుల దుర్వినియోగం కింద వారిపై వేటు పడింది. దీనిపై ప్రభుత్వం జీవోలు విడుదల చేసింది.