...

సీనియర్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వర రావుకు పోస్టింగ్.. సాయంత్రం రిటైర్మెంట్

సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వర రావుని సర్వీస్‌ లోకి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రింటింగ్‌, స్టేషనరీ అండ్‌ స్టోర్స్‌ పర్చేజ్‌ కమిషనర్‌గా ఏబీవీకి పోస్టింగ్‌ ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు సర్వీసు లోకి తీసుకునేందుకు వీలుగా ఏబీవీపై సస్పెన్షన్ ఎత్తి వేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఏబీవీపై రాష్ట్ర ప్రభుత్వం విధించిన సస్పెన్షన్‌ను ఇటీవల కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్‌ (క్యాట్‌) ఎత్తివేసింది. ఇవాళ ఉద్యోగ విరమణ చేయనున్న దృష్ట్యా .. వెంకటేశ్వర రావుకు పోస్టింగ్ ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అనంతరం ఆయన విజయవాడలో బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు స్వీకరించిన రోజే విరమణ చేయాల్సిన పరిస్థితి వచ్చిందని సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వర రావు అన్నారు. ప్రభుత్వ ఉద్యోగిగా వివాదాస్పద అంశాలు మాట్లాడ లేనని, ప్రస్తుతానికి ఇంతవరకే మాట్లాడగలనని అన్నారు. ఇన్నాళ్లు తోడుగా ఉండి ధైర్యం చెప్పిన శ్రేయోభిలాషులకు రుణపడి ఉంటానని ఆయన తెలిపారు.

గతంలో రెండుసార్లు సస్పెండ్‌

రక్షణ పరికరాల కొనుగోలు వ్యవహారంలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలతో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏబీ వెంకటేశ్వర రావును సస్పెండ్‌ చేసింది. డైరెక్టర్‌ జనరల్‌ ర్యాంక్‌ కలిగిన ఆయనకు ఐదేళ్లుగా పోస్టింగ్‌ ఇవ్వకుండా సస్పెన్షన్ల మీద సస్పెన్షన్లు విధించింది. అక్రమ కేసులతో వైఎస్ జగన్‌ ప్రభుత్వం, వైఎస్సార్సీపీ వీరభక్త అధికార గణం వేధించింది. ఆ తర్వాత ఏబీవీ క్యాట్‌ను ఆశ్రయించగా సస్పెన్షన్‌ను సమర్థించింది. అనంతరం ఆయన హైకోర్టుకు వెళ్లగా ఉన్నత న్యాయస్థానం సస్పెన్షన్‌ను కొట్టి వేసింది. హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. సర్వీసులో ఉన్న అధికారిని రెండేళ్ల కంటే ఎక్కువ కాలం సస్పెన్షన్‌లో ఉంచొద్దని ఆదేశిస్తూ ఏబీ వెంకటేశ్వరbరావుపై ఉన్న సస్పెన్షన్‌ను అత్యున్నత న్యాయస్థానం రద్దు చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల కనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఏబీ వెంకటేశ్వర రావుకు పోస్టింగ్‌ ఇచ్చింది. ఆ తర్వాత కొద్ది రోజులకే గతంలో ఏ కారణంతో సస్పెండ్‌ చేశారో తిరిగి అదే కారణంతో మరోసారి ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. కొద్ది రోజుల క్రితం ఏబీవీపై ప్రభుత్వం రెండో సారి విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేస్తూ కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్‌ – క్యాట్‌ ఉత్తర్వులు ఇచ్చింది.

అయితే, క్యాట్‌ ఆదేశాలపై స్టే ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. విచారణ జరిపిన రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం క్యాట్‌ ఉత్తర్వులపై స్టే ఇవ్వలేమని స్పష్టం చేసింది. ఏబీవీ ఇవాళ పదవీ విరమణ చేయనున్నారనే విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించిన హైకోర్టు ప్రభుత్వం ఐదేళ్లుగా ఆయన్ని సస్పెన్షన్‌ లోనే ఉంచిన విషయాన్ని గుర్తు చేసింది. సస్పెన్షన్‌ ఎత్తి వేస్తూ క్యాట్‌ ఇచ్చిన ఆదేశాలను ఈ దశలో నిలిపిస్తే అది ఏబీ వెంకటేశ్వర రావుకి తీవ్ర నష్టం కలగ జేస్తుందని వెకేషన్‌ బెంచ్‌ స్పష్టం చేసింది. సుదీర్ఘమైన సర్వీసు కలిగి ఎన్నో కీలకమైన పదవులు నిర్వహించిన ఏబీ వెంకటేశ్వర రావుకి సంబంధించి క్యాట్‌ ఉత్తర్వుల్ని అమలు చేయకుండా ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సరి కాదని అభిప్రాయ పడింది. హైకోర్టు ఆదేశాలతో ఏబీవీకి పోస్టింగ్‌ ఇచ్చేందుకు వీలుగా ఆయనపై ఉన్న సస్పెన్షన్‌ను ఎత్తి వేస్తూ సీఎస్‌ ఆదేశాలు ఇచ్చారు

Share the post
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us

Hot this week

ఖేలో ఇండియా 2026కు వేదికగా హైదరాబాద్.. కేంద్రం సుముఖం

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి మేరకు ఖేలో ఇండియా – 2026...

ఇందిరమ్మ ఇళ్ల పథకం అర్హులు వీరే.. సీఎం రేవంత్ గుడ్ న్యూస్ !

తెలంగాణలో త్వరలో ప్రారంభం కానున్న ఇందిర‌మ్మ ఇళ్ల మంజూరులో అత్యంత నిరుపేద‌ల‌కు...

హైదరాబాద్ – టర్కీల మధ్య నిజాం కాలం నుండే సత్సంబందాలు

రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహతో...

మన్నెగూడ రోడ్డు పనులు ఎందుకు ప్రారంభించడం లేదు.. మంత్రి కోమటి రెడ్డి సీరియస్

రాష్ట్రంలో ప్రతిపక్షాలు వికృతంగా ప్రవర్తిస్తున్నాయని మండిపడ్డారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి....

ధాన్యం కొనుగోళ్లు త్వరితగతిన పూర్తి చేయాలి: సీఎం

రాష్ట్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలలో కొనుగోళ్లు త్వరితగతిన పూర్తి చేయాలని, రైతులకు...

Topics

ఖేలో ఇండియా 2026కు వేదికగా హైదరాబాద్.. కేంద్రం సుముఖం

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి మేరకు ఖేలో ఇండియా – 2026...

ఇందిరమ్మ ఇళ్ల పథకం అర్హులు వీరే.. సీఎం రేవంత్ గుడ్ న్యూస్ !

తెలంగాణలో త్వరలో ప్రారంభం కానున్న ఇందిర‌మ్మ ఇళ్ల మంజూరులో అత్యంత నిరుపేద‌ల‌కు...

హైదరాబాద్ – టర్కీల మధ్య నిజాం కాలం నుండే సత్సంబందాలు

రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహతో...

మన్నెగూడ రోడ్డు పనులు ఎందుకు ప్రారంభించడం లేదు.. మంత్రి కోమటి రెడ్డి సీరియస్

రాష్ట్రంలో ప్రతిపక్షాలు వికృతంగా ప్రవర్తిస్తున్నాయని మండిపడ్డారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి....

ధాన్యం కొనుగోళ్లు త్వరితగతిన పూర్తి చేయాలి: సీఎం

రాష్ట్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలలో కొనుగోళ్లు త్వరితగతిన పూర్తి చేయాలని, రైతులకు...

ఫుడ్ పాయిజన్.. మృత్యువుతో పోరాడి ఓడిన గిరిజన విద్యార్థి

మృత్యువే గెలిచింది.. దాదాపు 20 రోజులకుపైగా నిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న...

RGV: రాంగోపాల్ వర్మ అరెస్టుకు రంగం సిద్దం! హైదరాబాద్ కు ఏపీ పోలీసులు

ప్రముఖ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ తన వ్యూహం సినిమా ప్రమోషన్ కోసం...

పండుగ వాతావరణంలో ప్రజాపాలన విజయోత్సవాలు

డిసెంబర్ 1వ తేదీ నుంచి 9వ తేదీ వరకు రాష్ట్రమంతా పండుగ...
spot_img

Related Articles