ఏడాది పాటు అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి ఉత్సవాలు నిర్వహిస్తామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్ర రాజధాని అమరావతిలో 58 అడుగుల పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతున్నామని అన్నారు. ఆయన జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి నివాళులు అర్పించారు. నెల్లూరు జిల్లాలోని పొట్టి శ్రీరాములు యొక్క గ్రామాన్ని అభివృద్ధి చేసి, మ్యూజియం ఏర్పాటు చేస్తామని అన్నారు. ఆయన పేరుతో ఆధునిక ఉన్నత పాఠశాలను నిర్మిస్తామని సీఎం చంద్రబాబు వెల్లడించారు.