ఆంధ్రప్రదేశ్ లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఆ తర్వాత ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. గత ఐదేళ్లలో నష్టపోయిన ఏపీకి పునరుజ్జీవం వస్తుందని ప్రజలకు హామీ ఇచ్చారు.
స్వాతంత్య్రం కొరకు ప్రజలు ఐదేళ్లుగా కోల్పోయిన స్వేచ్ఛను తిరిగి అందించేందుకు తాము కట్టుబడినట్లు చెప్పారు. సంక్షేమం మరియు అభివృద్ధి ఈ పాలన యొక్క రెండు ప్రధాన ప్రాధాన్యాలుగా పేర్కొన్నారు. గత ప్రభుత్వం విస్మరించిన శాఖలను పునరుద్ధరించేందుకు 100 రోజుల ప్రణాళికతో అన్ని శాఖల్లో సమీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
విభజన తర్వాత నూతన ఆంధ్రప్రదేశ్ కు రాజధాని లేకుండా పాలన ప్రారంభించారు. అలాంటి సవాళ్లను ఎదుర్కొని ప్రభుత్వం క్రమంగా స్థిరపడ్డదని, ప్రజల సహకారంతో విజయం సాధించామన్నారు. 120కి పైగా సంక్షేమ పథకాలు ప్రారంభించి, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపర్చాం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మొదటి స్థానంలో నిలిచాం అని వెల్లడించారు. 16 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు వివిధ సంస్థలతో ఒప్పందాలు చేసినట్లు, తద్వారా దేశవ్యాప్తంగా ఏపీకి ప్రముఖ్యత కల్పించామని అన్నారు.