వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన కొనసాగుతోంది. శనివారం వర్షంలో కూడా దాదాపు 3 గంటలపాటు సీఎం పర్యటన కొనసాగింది. విజయవాడలోని సింగ్ నగర్, మ్యాంగో మార్కెట్, భవానీపురం, సితార, ఎర్రకట్ట ప్రాంతాలలో ఆయన పర్యటన సాగింది. వరదభాధితుల కష్టాలను నేరుగా సీఎం తెలుసుకున్నారు. ప్రజలు తమ సమస్యలను చంద్రబాబుకు వివరించారు. వరదలతో తమ ఇండ్లలోని సామాను, వస్తువులు, వాహనాలు దెబ్బతిన్నాయని.. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరారు. ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం చంద్రబాబు వారికి భరోసా కల్పించారు.
విజయవాడలోని వరద ప్రాంతాల్లో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నేడు 3 గంటల పాటు పర్యటించారు. (1/5) pic.twitter.com/xpx7tRJ9ey
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) September 7, 2024