ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) అధ్యక్షతన బుధవారం ఉదయం కేబినెట్ భేటి (Cabinet Meeting) ప్రారంభమైంది. మంత్రివర్గ సమావేశానికి ఉపముఖ్యమంత్రి (Deputy CM) పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కూడా హాజరయ్యారు. ఈ సమావేశంలో మంత్రివర్గం ముందు పలు శాఖలు కీలక అంశాలను చర్చించనున్నారు. వాలంటీర్ వ్యవస్థ, నూతన మద్యం పాలసీ, ఆడబిడ్డ నిధి, బీసీ కార్పొరేషన్ కోసం నిధులు మంజూరు లాంటి పలు కీలక అంశాలపై కేబినెట్ చర్చించనుంది. అలాగే పరిశ్రమలకు భూముల కేటాయింపుపై నిర్ణయం తీసుకోనుంది. వాటిపై మంత్రివర్గం చర్చించి అంతిమ నిర్ణయం తీసుకోనుంది.పలు ఉద్యోగాల భర్తీకి కేబినెట్ ఆమోదం తెలపనుంది. టాయింపులపై కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. అలాగే పేదరికం లేని సమాజం నిర్మాణంలో భాగంగా పీ-4 పైనా కేబినెట్లో చర్చించనున్నారు. పెండింగ్ లో ఉన్న నీరు-చెట్టు బిల్లులకు నిధుల విడుదల, ఇరిగేషన్ ప్రాజెక్టులు, గేట్లు, కరకట్టల పటిష్టతకు ఎమర్జెన్సీ ఫండ్ కింద రూ. 300 కోట్లు విడుదల, మద్యం పాలసీతోపాటు ఇతర పాలసీలపై కూడా మంత్రి వర్గం చర్చించే అవకాశం ఉంది.