...

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్‌ ఫలితాలు విడుదల

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్‌ ఫలితాలు ఇవాళ విడుదలయ్యాయి. తాడేపల్లి లోని ఇంటర్ ఆఫీసులో విద్యా మండలి కార్యదర్శి సౌరభ్‌ గౌర్‌ ఫలితాలు విడుదల చేశారు. ఇంటర్ రెండో సంవత్సర ఫలితాల్లో 78 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. మొదటి సంవత్సర విద్యార్థుల్లో 67 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ఇంటర్ ఫస్టియర్ లో 84 శాతం ఉత్తీర్ణతతో కృష్ణా జిల్లా అగ్ర స్థానంలో నిలిచింది. 81 శాతంతో గుంటూరు, 79 శాతం ఉత్తీర్ణతతో గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాలు రెండు, మూడో స్థానాల్లో ఉన్నాయి.

ఫస్ట్ ఇయర్‌లో చిత్తూరు లీస్ట్ పర్సెంటేజ్ సాధించింది. ఇంటర్ రెండో సంవత్సర ఫలితాల్లో 90 శాతం ఉత్తీర్ణతతో కృష్ణా జిల్లా తొలి స్థానంలో నిలిచింది. అలాగే, 87 శాతం ఉత్తీర్ణతతో గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాలు రెండు, మూడో స్థానాల్లో ఉన్నాయి. ఫెయిల్ అయిన విద్యార్థులకు సప్లమెంటరీ ఎగ్జాంలో మరొకసారి అవకాశం ఉంటుంది. మార్క్ లిస్ట్ లో సప్లమెంటరీలో పాస్ అయినట్లు ఉండదని అధికారులు తెలిపారు. విద్యార్థులు ఫలితాలను resultsbie.ap.gov.inలో చూసుకోవచ్చు.

ఏపీ ఇంటర్ పరీక్షలను దాదాపు 9.99 లక్షల మంది విద్యార్థులు రాశారు. ఎన్నికల నేపథ్యంలో సర్కారు నిర్ణయం మేరకు ఇంటర్ పరీక్షలను మార్చి 1 నుంచి 20 వరకు నిర్వహించిన విషయం తెలిసిందే. ఇంటర్ పత్రాల మూల్యాంకనం ఏప్రిల్‌ 4న ముగిసింది. ఈ ఏడాది ఇంటర్ ప్రథమ సంవత్సరం 4,73,058 మంది, రెండో సంవత్సరం 5,79,163 మంది విద్యార్థులు పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 9.99 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఏపీలో 26 జిల్లాల్లో 1,559 సెంటర్లలో పరీక్షలు నిర్వహించారు.

బాల బాలికల వారీగా ఫలితాల వివరాలు:

మొదటి సంవత్సరం పరీక్షలకు హాజరైన బాలురు 2,26,240 మంది.

ఉత్తీర్ణత సాధించిన వారు 1,43,688 మంది.

ఉత్తీర్ణత శాతం 64.

మొదటి సంవత్సరం ఇంటర్ పరీక్షలకు హాజరైన బాలికలు 2,35,033 మంది.

ఉత్తీర్ణత సాధించిన వారు 1,67,187 మంది.

ఉత్తీర్ణత శాతం 71.

ఉత్తీర్ణతలో బాలికలదే పైచేయి.

ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలకు హాజరైన బాలురు 1,88,849 మంది.

ఉత్తీర్ణత సాధించిన వారు 1,44,465 మంది.

ఉత్తీర్ణత శాతం 75.

ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలకు హాజరైన బాలికలు 2,04,908 మంది.

ఉత్తీర్ణత సాధించిన వారు 1,65,063 మంది.

ఉత్తీర్ణత శాతం 81.

ద్వితీయ సంవత్సరం పరీక్షల్లో బాలికలదే పైచేయి.

Share the post
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us

Hot this week

ఖేలో ఇండియా 2026కు వేదికగా హైదరాబాద్.. కేంద్రం సుముఖం

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి మేరకు ఖేలో ఇండియా – 2026...

ఇందిరమ్మ ఇళ్ల పథకం అర్హులు వీరే.. సీఎం రేవంత్ గుడ్ న్యూస్ !

తెలంగాణలో త్వరలో ప్రారంభం కానున్న ఇందిర‌మ్మ ఇళ్ల మంజూరులో అత్యంత నిరుపేద‌ల‌కు...

హైదరాబాద్ – టర్కీల మధ్య నిజాం కాలం నుండే సత్సంబందాలు

రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహతో...

మన్నెగూడ రోడ్డు పనులు ఎందుకు ప్రారంభించడం లేదు.. మంత్రి కోమటి రెడ్డి సీరియస్

రాష్ట్రంలో ప్రతిపక్షాలు వికృతంగా ప్రవర్తిస్తున్నాయని మండిపడ్డారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి....

ధాన్యం కొనుగోళ్లు త్వరితగతిన పూర్తి చేయాలి: సీఎం

రాష్ట్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలలో కొనుగోళ్లు త్వరితగతిన పూర్తి చేయాలని, రైతులకు...

Topics

ఫుడ్ పాయిజన్.. మృత్యువుతో పోరాడి ఓడిన గిరిజన విద్యార్థి

మృత్యువే గెలిచింది.. దాదాపు 20 రోజులకుపైగా నిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న...

RGV: రాంగోపాల్ వర్మ అరెస్టుకు రంగం సిద్దం! హైదరాబాద్ కు ఏపీ పోలీసులు

ప్రముఖ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ తన వ్యూహం సినిమా ప్రమోషన్ కోసం...

పండుగ వాతావరణంలో ప్రజాపాలన విజయోత్సవాలు

డిసెంబర్ 1వ తేదీ నుంచి 9వ తేదీ వరకు రాష్ట్రమంతా పండుగ...
spot_img

Related Articles