దివంగత రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్ రామోజీ రావు (Ramoji Rao) సంస్మరణ కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు ఇచ్చారు. ఈ మేరకు మంత్రి కొలుసు పార్థసారథి వివరాలను ప్రకటించారు. ఈ నెల 27వ తేదీన పెనమలూరులో రామోజీరావు సంస్మరణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు.