ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత ప్రయాణిస్తున్న కాన్వాయ్ లోని ముందు వాహనం ఓ బైక్ ను తప్పించబోయి.. సడన్ బ్రేక్ వేయడంతో వెనుక మంత్రి ప్రయాణిస్తున్న కారు ముందు కారును ఢీకొట్టింది. ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం కైకరం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. మంత్రి అనిత విజయవాడ నుంచి పశ్చిమగోదావరి జిల్లా అలంపురం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మంత్రి ప్రయాణిస్తున్న కారు, ఎస్కార్ట్ వాహనం స్వల్పంగా దెబ్బతిన్నాయి. అయితే మంత్రితో సహా కారులోని ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అనతంతరం మంత్రి అనిత మరో వాహనంలో అలంపురం వెళ్లారని అధికారులు తెలిపారు.









