ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడికి స్కిల్ డెవలప్మెంట్ కేసులో విజయవాడ ఏసీబీ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. చంద్రబాబు హౌస్ కస్టడీ పిటిషన్‌పై విచారణ ఏసీబీ కోర్టులో వాడి వేడిగా వాదనలు సాగాయి. రాష్ట్ర ప్రభుత్వం తరపున అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్, పొన్నవోలు సుధాకర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు తరపున సిద్ధార్థ లుథ్రా తమ తమ వాదనలు వినిపించారు.
సెంట్రల్ జైలులో చంద్రబాబు నాయుడు కోసం కోసం తీసుకున్న చర్యలకు సంబంధించి హోం సెక్రటరీ అడ్వకేట్ జనరల్‌కు లేఖ రాశారు. ఆ లేఖను ఏజీ శ్రీరాం ఏసీబీ కోర్టుకు సమర్పించారు. చంద్రబాబు పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి కోర్టుకు తెలిపారు. అలాగే చంద్రబాబుకు జైలులో పూర్తి భద్రత ఉంది అని తెలిపారు. ఆయన ఇంట్లో ఉండటం కంటే సెంట్రల్ జైలులో ఉండటం సేఫ్ అని ఆయన కోర్టుకు తెలిపారు. అదేవిధంగా సుప్రీం కోర్టు గతంలో ఇచ్చిన కేసు తీర్పును చంద్రబాబు కేసును కలిపి చూడొద్దని విజ్ఞప్తి చేశారు. వీవీఐపీలకు కల్పించే అన్ని వసతులను చంద్రబాబుకు జైలులో కల్పించామని తెలిపారు. హౌజ్ అరెస్టు పిటిషన్ పై కోర్టులో వాదనలు ముగిసిన వెంటనే తీర్పు వెల్లడించాలని చంద్రబబు తరపున న్యాయవాదులు కోర్టును కోరారు. ఇరువురి వాదనలు విన్న ఏసీబీ కోర్టు హౌస్ అరెస్ట్ రిమాండ్ పిటిషన్ తీర్పును రేపు మద్యాహ్నం వెల్లడిస్తామని తీర్పును రేపటికి వాయిదా వేశారు.