Menu

  • Home
  • ఆంధ్రప్రదేశ్
  • Vangalapudi Anitha: ఆంధ్రప్రదేశ్ హోం మినిస్ట‌ర్ వంగలపూడి అనితకు త‌ప్పిన ప్ర‌మాదం
Image

Vangalapudi Anitha: ఆంధ్రప్రదేశ్ హోం మినిస్ట‌ర్ వంగలపూడి అనితకు త‌ప్పిన ప్ర‌మాదం

ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత ప్ర‌యాణిస్తున్న కాన్వాయ్ లోని ముందు వాహ‌నం ఓ బైక్ ను త‌ప్పించ‌బోయి.. స‌డ‌న్ బ్రేక్ వేయ‌డంతో వెనుక మంత్రి ప్ర‌యాణిస్తున్న కారు ముందు కారును ఢీకొట్టింది. ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం కైకరం వద్ద ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. మంత్రి అనిత విజయవాడ నుంచి పశ్చిమగోదావరి జిల్లా అలంపురం వెళ్తుండగా ఈ ప్ర‌మాదం జ‌రిగింది. ఈ ప్రమాదంలో మంత్రి ప్ర‌యాణిస్తున్న‌ కారు, ఎస్కార్ట్‌ వాహనం స్వల్పంగా దెబ్బతిన్నాయి. అయితే మంత్రితో సహా కారులోని ఎవరికీ ఎలాంటి గాయాలు కాక‌పోవ‌డంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అన‌తంత‌రం మంత్రి అనిత మరో వాహనంలో అలంపురం వెళ్లార‌ని అధికారులు తెలిపారు.

Share the post

Also Read..