Menu

Image

పోలీసుల తనిఖీలు.. 2.40 కోట్లు సీజ్

తూర్పు గోదావరిలో పోలీసులు భారీగా నగదు సీజ్‌ చేశారు. గోపాలపురం మండలం జగన్నాథపురం గ్రామ శివారు చెక్‌పోస్టు వద్ద తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో హైదరాబాద్‌ నుంచి విశాఖపట్నం వైపు వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సులో తరలిస్తున్న రూ. 2.40 కోట్ల నగదును పోలీసులు పట్టుకున్నారు. వాటికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో ఆడబ్బును సీజ్‌ చేసినట్లు దేవరపల్లి సీఐ బాల సురేష్‌ బాబు తెలిపారు.

Share the post

Also Read..