Menu

  • Home
  • ఆంధ్రప్రదేశ్
  • TTD TIRUMALA: తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలెర్ట్.. మళ్ళీ వెబ్ సైట్ పేరు మార్పు
Image

TTD TIRUMALA: తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలెర్ట్.. మళ్ళీ వెబ్ సైట్ పేరు మార్పు

మరోసారి తిరుమల తిరుపతి శ్రీవారి ఆలయానికి సంబంధించిన వివరాలను తెలియజేసే అధికారిక వెబ్ సైట్ పేరు మారినట్లు తితిదే ప్రకటించింది. గతంలో tirupatibalaji.ap.gov.in అని ఉన్న టిటిడీ వెబ్ సైట్ పేరు ఇప్పుడు ttdevasthanams.ap.gov.in గా మార్పు చేశారు. ఈ విషయాన్ని శ్రీవారి భక్తులు గమనించాల్సిందిగా టిటిడీ విజ్ఞప్తి చేసింది. తిరుపతి, ఇతర ప్రాంతాలలో ఉన్న టీటీడీ అనుబంధ ఆలయాలుతో పాటు హిందూ ధర్మానికి విస్తృత ప్రాచుర్యం కల్పించే దిశగా అన్ని వివరాలతో కొత్త వెబ్‌ సైట్‌ ttdevasthanams.ap.gov.in ను టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర రెడ్డి ప్రారంభించారు.

ఆలయానికి సంబంధించిన అధికారిక వెబ్ సైట్ పేరు మార్పుని వన్ ఆర్గనైజేషన్, వన్ వెబ్‌ సైట్, వన్ మొబైల్ యాప్’ లో భాగంగా మార్చినట్లు వెల్లడించింది. ఇక నుంచి శ్రీవారి భక్తులు ఆన్‌లైన్ బుకింగ్ ను ttdevasthanams.ap.gov.in వెబ్ సైట్ ద్వారా చేసుకోవాల్సిందిగా సూచించారు.స్వామి వారి భక్తులకు అన్ని సౌకర్యాలు ఒకే చోట లభించే విధంగా వెబ్ సైట్ పేరుని మారుస్తూ టీటీడీ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఒకే సంస్థ, ఒకే వెబ్‌ సైట్, ఒకే మొబైల్ యాప్ ఉండాలన్న నిర్ణయంతో పేరుని మార్చినట్లు ప్రకటించింది. ఇక పై భక్తులు శ్రీవారి దర్శనం కోసం లేదా ఆలయ వివరాల కోసం ఆన్‌లైన్ లో బుక్ చేసుకోవాలనుకుంటే.. ఇక నుంచి కొత్త వెబ్‌ సైట్‌ ని ఉపయోగించాలని వెల్లడించింది.గతంలో టీటీడీ వెబ్ సైట్ పేరు టీటీడీ సేవా ఆన్ లైన్ అనే పేరుతో ఉండేది. అనంతరం టీటీడీ వెబ్ సైట్‌ ను ప్రభుత్వానికి అనుబంధం చేస్తూ tirupatibalaji.ap.gov.in గా మార్చారు. ఇప్పుడు ఆ పేరుని కూడా మార్చి.. ttdevasthanams.ap.gov.in గా కొత్త పేరుని పెట్టారు.

ఈ కొత్త వెబ్ సైట్ లో తిరుపతిలో టీటీడీ పరిధిలో ఉన్న ఆలయాలతో పాటు.. అనుబంధ ఆలయాలకు సంబంధించిన వివరాలు, చరిత్రతో సహా శ్రీవారి దర్శన వేళలు, ఆర్జిత సేవలు, రవాణ వివరాలు, బస సహా ఇతర వివరాలను భక్తులు తెలుసుకోవచ్చు. అంతేకాదు, ఈ వెబ్ సైట్ ద్వారా శ్రీవారి ఆలయ విశిష్టతపై ఫొటోలు, వీడియో లను భక్తులకు అందుబాటులో ఉంచారు. జియో సంస్థ సహకారంతో టీటీడీ ఐటీ విభాగం టిటిడీ వెబ్ సైట్ ను ఆధునీకరించింది.

Share the post

Also Read..