ప్రజాపాలన విజయోత్సవాలు – 2024 లోభాగంగా ప్రజాపాలన సంబరాలు అంబరాన్ని అంటేలా రాష్ట్రంలో మొదటగా మంత్రి దామోదర రాజనర్సింహ ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభం అయ్యాయి. రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఏడాది కాలంలో అమలైన ప్రజాసంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభఉత్వం పలు కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఇందులో బాగంగా స్కృతిక సారథి కళాకారులు తమ ఆటపాటలతో ప్రజలకు వివిధ కళారూపాలలో ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, గృహ జ్యోతి పథకం కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, పంట రుణాల మాఫీ, ఉద్యోగుల భర్తీ, రెసిడెన్షియల్ పాఠశాలల నిర్మాణానికి శంకుస్థాపన, రైతు భరోసా, స్కిల్ యూనివర్సిటీ, స్వయం సహాయక బృందాల మహిళలకు రుణాల వంటి అంశాలపై రూపొందించిన అవగాహన కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఈ విజయోత్సవాలను జోగిపేట పట్టణంలోని క్రీడా మైదానం లో పండుగలా ప్రారంభించారు మంత్రి దామోదర్ రాజనర్సింహ.
Also Raed…| ఇందిరా మహిళాశక్తి సభ్యులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి: భట్టి విక్రమార్క
ఈ కార్యక్రమంలో నారాయణఖేడ్ శాసనసభ్యులు సంజీవరెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ కార్పొరేషన్ చైర్మన్లు నిర్మల జగ్గారెడ్డి , గిరిధర్ రెడ్డి, మాజీ శాసనసభ్యులు తూర్పు జయప్రకాశ్ రెడ్డి, మాజీ మంత్రి చంద్రశేఖర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంజయ్య, స్థానిక ప్రజాప్రతినిధులు, జిల్లాకు చెందిన వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.