Menu

  • Home
  • తెలంగాణ
  • ‘నేనే రాజు.. నేనే మంత్రి’ అని అందుకే అన్నాను: సీఎం
నేనే రాజు నేనే మంత్రి

‘నేనే రాజు.. నేనే మంత్రి’ అని అందుకే అన్నాను: సీఎం

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల తాను చేసిన ‘నేనే రాజు.. నేనే మంత్రి‘ వ్యాఖ్యలపై నెలకొన్న వివాదానికి తెరదించుతూ క్లారిటీ ఇచ్చారు. హైదరాబాద్‌లోని బంజారా భవన్‌లో జరిగిన సంత్ సేవాలాల్ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఆయన, తన మాటలను ప్రతిపక్షాలు కావాలనే వక్రీకరించాయని అన్నారు.

ఆ అర్థంలోనే ‘ నేనే రాజు.. నేనే మంత్రి’ వ్యాఖ్యలు

ఇటీవల తాను విలేకరులతో మాట్లాడిన క్రమంలో తాను అన్న మాటలను ప్రతిపక్ష నేతలు తప్పుగా అర్థం చేసుకున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. తాను ఆ మాటను అహంకారంతో అనలేదని, బాధ్యతతో అన్నానని స్పష్టం చేశారు. “నేనే ముఖ్యమంత్రిని, నేనే మున్సిపల్ శాఖ మంత్రిని కూడా.. కాబట్టి రాబోయే మున్సిపల్ ఎన్నికల గెలుపోటములకు పూర్తి బాధ్యత నాదేనని చెప్పాను. ఆ ఫలితమే నా పనితనానికి నిదర్శనం అని భావించాను తప్ప, పాలకుడిలా వ్యవహరించాలని కాదు” అని ఆయన వివరించారు. ప్రజలు తమకు సేవ చేసే అవకాశాన్ని ఇచ్చారని, తాము ఎప్పటికీ పాలకులం కాదని, ప్రజల సేవకులమేనని ఆయన స్పష్టం చేశారు.

Share the post