Menu

  • Home
  • జాతీయం
  • భద్రతా బలగాలకు పూర్తిస్వేచ్ఛ.. మోడీ సంచలనం
PM Gives Forces 'Full Operational Freedom' To Respond To J&K Attack

భద్రతా బలగాలకు పూర్తిస్వేచ్ఛ.. మోడీ సంచలనం

పహల్గామ్‌ ఉగ్రదాడి తర్వాత ఇటీవల చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో దేశ భద్రతా పరిస్థితులపై ప్రధాని నరేంద్ర మోదీ అత్యున్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్, ముగ్గురు సైనిక దళాధిపతులు పాల్గొన్నారు.

భద్రతా బలగాలకు పూర్తి స్వేచ్ఛ

ప్రధాని నివాసంలో జరిగిన ఈ సమావేశంలో జమ్మూ కాశ్మీర్ లోని ప్రస్తుత పరిస్థితులపై విస్తృతంగా చర్చించారు. ఉగ్రవాద కార్యకలాపాలను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి తీసుకోవాల్సిన చర్యలపై క్షుణ్ణంగా సమీక్షించారు. భద్రతా బలగాల కార్యాచరణ ప్రణాళికలు, నిఘా వ్యవస్థల బలోపేతం, సరిహద్దు భద్రత వంటి అంశాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు.

Also Read…| శాంతి దూతగా పోప్ ఫ్రాన్సిస్‌ చెరగని ముద్ర

ఉగ్రవాదంపై రాజీలేని పోరాటం

ఉగ్రవాదంపై రాజీలేని పోరాటం కొనసాగించాలని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. దేశ భద్రతకు ముప్పు కలిగించే శక్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని ఆయన తేల్చి చెప్పారు. భారత సాయుధ బలగాల నైపుణ్యం, సామర్థ్యాలపై ప్రధాని పూర్తి విశ్వాసం వ్యక్తం చేశారు. ఉగ్రవాదులను ఎదుర్కోవడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవడానికి వారికి పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు. కార్యాచరణ ప్రణాళికలు, లక్ష్యాలు, సమయం వంటి విషయాల్లో నిర్ణయాలు తీసుకునే అధికారాన్ని భద్రతా బలగాలకు అప్పగించారు.

పహల్గామ్ ఉగ్రదాడిలో అమాయక పర్యాటకులు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో ఈ సమీక్షకు ప్రాధాన్యత ఏర్పడింది. దేశ భద్రతను కాపాడటానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దృఢమైన చర్యలు తీసుకుంటుందని ప్రధాని మోదీ ఈ సమావేశం ద్వారా స్పష్టం చేశారు.

Share the post

Also Read..