Menu

PopeFrancis

శాంతి దూతగా పోప్ ఫ్రాన్సిస్‌ చెరగని ముద్ర

ప్రపంచ శాంతి కోసం పోప్ ఫ్రాన్సిస్ చేసిన కృషి చిరస్థాయిగా నిలుస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. పోప్ ఫ్రాన్సిస్ మరణం పట్ల ఆయన తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. పోప్ ఫ్రాన్సిస్ తన జీవితాన్ని మానవసేవకు, క్రైస్తవ మత ప్రచారానికి అంకితం చేశారని, శరణార్థులకు అండగా నిలిచారని కొనియాడారు. సామాజిక న్యాయం, మత సామరస్యం కోసం ఆయన అవిశ్రాంతంగా కృషి చేశారని సీఎం అన్నారు. పోప్ ఫ్రాన్సిస్ మరణం మానవాళికి తీరని లోటు అని ఆయన పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవ సమాజానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

Share the post

Also Read..