ఒడిశాలోని పూరీలో ఆదివారం జరిగిన జగన్నాథ రథయాత్రలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. లక్షలాది మంది భక్తులు పాల్గొన్న ఈ మహోత్సవంలో జరిగిన తొక్కిసలాటలో ముగ్గురు భక్తులు మరణించగా, 50 మందికిపైగా గాయపడ్డారు. ఈ ఘటన గుండిచా ఆలయం సమీపంలోని శారదబలి వద్ద జరిగింది. ప్రతి ఏటా ఎంతో వైభవంగా జరిగే పూరీ రథయాత్రకు దేశం నలుమూలల నుండి, విదేశాల నుండి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర అమ్మవార్ల రథాలు గుండిచా ఆలయానికి చేరుకున్న సమయంలో, దేవుళ్ల దర్శనం కోసం భక్తులు ఒక్కసారిగా భారీ సంఖ్యలో ముందుకు దూసుకువచ్చారు. ఈ క్రమంలో తోపులాట జరిగి తొక్కిసలాటకు దారితీసింది.
Also Read..| ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల
జగన్నాథ రథయాత్రలో ముగ్గురు మృతి
ఈ దుర్ఘటనలో మరణించిన వారిని ప్రేమకాంత మొహంతి (80), బసంతి సాహూ (36), ప్రభాతి దాస్ (42) గా గుర్తించారు. వీరంతా తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే లేదా ఆసుపత్రికి తరలించే మార్గంలో మృతి చెందినట్లు తెలుస్తోంది. గాయపడిన 50 మందికిపైగా భక్తులను హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై అధికారులు విచారణకు ఆదేశించారు. రథయాత్ర వంటి భారీ జన సమూహాలు పాల్గొనే కార్యక్రమాలలో భద్రతా ఏర్పాట్లు పటిష్టంగా ఉన్నాయా లేదా అనే కోణంలో అధికారులు ఆరా తీస్తున్నారు. భద్రతా ఏర్పాట్లలో లోపాలు ఉన్నాయా, జన నియంత్రణ సరిగా జరిగిందా లేదా అనే అంశాలపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
3 DEAD in PURI STAMPEDE
— Deepti Sachdeva (@DeeptiSachdeva_) June 29, 2025
Rath Yatra turns deadly at Gundicha Temple.
Trucks entered packed crowd. Chaos. Crush. Collapse.
Govt orders inquiry — but where was crowd control?#Puri #RathYatra #Stampede #Odisha #JagannathRathYatra pic.twitter.com/j79GtNdw7g