Thursday, March 27, 2025
HomeNewsNationalమహారాష్ట్రలో మహాయుతి.. జార్ఖండ్ లో జేఎమ్ఎమ్ ఘనవిజయం

మహారాష్ట్రలో మహాయుతి.. జార్ఖండ్ లో జేఎమ్ఎమ్ ఘనవిజయం

మహారాష్ట్ర(Maharashtra), జార్ఖండ్‌(Jharkhand) అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు (Election Results) శనివారం వెలువడ్డాయి. ఉదయం 8.గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమయింది. ఎగ్జిట్ పోల్స్(Exit Polls) అంచనాలకు మించి ఫలితాలు వెలువడ్డాయి. మహారాష్ట్రలో బీజేపీ (BJP) సారథ్యంలోని మహాయుతి(mahayuti) కూటమి భారీవిజయం సాధించింది. 288 సీట్లకు గాను 234 సీట్లలో మహాయుతి కూటమి నేతలు విజయం సాధించారు. బీజేపీ 132 సీట్లతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. ఏక్ నాథ్ శిండే(Eknath shinde) శివసేన పార్టీకి అనూహ్యంగా 57 సీట్లు వచ్చాయి. అజిత్ పవార్ (Ajit Pawar) ఎన్సీపి పార్టీకి 41 సీట్లు వచ్చాయి. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో తక్కువ సీట్లు వచ్చిన బీజేపీ కూటమికి ఈ ఎన్నికల్లో ప్రజలు అపూర్వ విజయాన్ని కట్టబెట్టారు. మహారాష్ట్ర ప్రజలు చీలిక పార్టీల వర్గాలనే ఆదరించారు.

కాంగ్రెస్ నేతృత్వంలోని మహావికాస్ అఘాడి (Maha Vikas Aghadi) కూటమి కేవలం 48 సీట్లకే పరిమితమయి ఘోర పరాభవాన్ని చవిచూసింది. మహావికాస్ అఘాడీ కూటమిలో భాగస్వాములైన కాంగ్రెస్ పార్టీకి (congress) 16 సీట్లు, ఉద్ధవ్ థాక్రే (uddhav thackeray) శివసేన పార్టీకి 20 సీట్లు, ఎన్సీపీ శరద్ పవార్ (Sharad Pawar)పార్టీకి 10 సీట్లు మాత్రమే వచ్చాయి. మహారాష్ట్రలో ఈనెల 25వ తేదీన సీఎం అభ్యర్ధిని ఎన్నుకుంటారు. 26న ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం ఉండనుంది.

Also Read.. | Good News.. సెట్విన్ లో 100% స్వయం ఉపాధికి కోర్సులు !

జార్ఖండ్ లో జేఎంఎం ఘనవిజయం

జార్ఖండ్ (Jharkhand) లో మొత్తం 81 అసెంబ్లీ స్థానాలకు గానూ JMM పార్టీ ఆధ్వర్యంలోని ఇండియా కూటమి 56 చోట్ల గెలుపొందింది. బీజేపీ నేతృత్వంలోని ఎన్​డీఏ (NDA) కూటమి 24 స్థానాలకే పరిమితమైంది. ఉదయం కౌంటింగ్ ప్రారంభం అయిన నుండి రెండు కూటముల మధ్య హోరా హోరీ ఆధిక్యత కొనసాగింది. అనంతరం ఇండియా కూటమి పైచేయి సాధించింది. తిరిగి రెండవసారి హేమంత్ సోరెన్ (Hemant Soren) ప్రభుత్వాన్ని ఏర్పాడు చేయనున్నారు. మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ (Exit Polls) జార్ఖండ్ లో ఎన్డీయే కూటమి అధికారంలోకి వస్తుందని తెలిపాయి. కానీ అంచనాలన్నీ తారుమారు చేస్తూ జేఎమ్ఎమ్ (JMM) నేతృత్వంలోని కాంగ్రెస్ కూటమి మరోసారి అధికారాన్ని హస్తగతం చేసుకుంది.ఎన్నికలకు ముందు జేఎంఎం చీఫ్‌ హేమంత్ సోరెన్ అరెస్ట్ అయి జైలుకు వెళ్లి రావడం.. బీజేపీ అక్రమ కేసులతో వేధిస్తోందని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లడంలో సోరెన్ సక్సస్ అయ్యారు. మహిళలకు నెలకు వెయ్యి రూపాయలను 2500కు పెంచడం లాంటి పథకాల వల్ల మహిళా ఓటర్లు పెద్ద ఎత్తున ఇండియా కూటమికి మద్దతు తెలిపారు.

Share the post
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us
RELATED ARTICLES

Most Popular

Recent Comments