Menu

  • Home
  • తెలంగాణ
  • రేవంత్ రెడ్డి సిద్దిపేట జిల్లా పర్యటన..సీఎంకు హరీశ్ లేఖ
cm revanth siddipet tour harish rao

రేవంత్ రెడ్డి సిద్దిపేట జిల్లా పర్యటన..సీఎంకు హరీశ్ లేఖ

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్దిపేట జిల్లా పర్యటన నేపథ్యంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. శనివారం తన క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన, సిద్దిపేట అభివృద్ధి పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న కక్షసాధింపు ధోరణిని ఎండగడుతూ ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ విడుదల చేశారు. “శ్రమ మాది.. శిలాఫలకం రేవంత్ రెడ్డిది” అంటూ ప్రస్తుత ప్రభుత్వ తీరును ఆయన విమర్శించారు.

రేవంత్ రెడ్డి సిద్దిపేట జిల్లా పర్యటన వేళ హరీష్ విమర్శలు


గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంజూరై, నిధులు కేటాయించి, నిర్మాణాలు పూర్తి చేసుకున్న భవనాలకు ఇప్పుడు ముఖ్యమంత్రి రిబ్బన్ కటింగ్ చేస్తున్నారని హరీశ్ రావు ఎద్దేవా చేశారు. ముఖ్యంగా రూ. 300 కోట్లతో నిర్మించిన ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ, సెంట్రల్ డ్రగ్ స్టోర్, ఆయుష్ ఆస్పత్రి, జిల్లా జైలు వంటివన్నీ కేసీఆర్ కృషితోనే సాధ్యమయ్యాయని గుర్తు చేశారు. “శిలాఫలకాల మీద రేవంత్ రెడ్డి పేరు ఉండొచ్చు కానీ, సిద్దిపేట ప్రజల మనోఫలకాల మీద మాత్రం కేసీఆర్ పేరే ఉంటుంది” అని ఆయన స్పష్టం చేశారు.

కాళేశ్వరం జలాలతోనే ఫ్యాక్టరీ ప్రారంభం


నాడు కాళేశ్వరం ప్రాజెక్టును ‘కూలేశ్వరం’ అని ఎగతాళి చేసిన రేవంత్ రెడ్డి, నేడు అదే ప్రాజెక్టు జలాలతో నడిచే ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని ప్రారంభించడం శోచనీయమని హరీశ్ రావు అన్నారు. ఈ ఫ్యాక్టరీ కోసం ప్రత్యేకంగా కాలువలు పొడిగించి, చెరువులు నిర్మించి నీరందించింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఆయన వివరించారు. అడ్డంకులు సృష్టించిన వారే నేడు లబ్ధి పొందుతున్నారని మండిపడ్డారు.

రైతులకు దగా.. రూ. 1070 కోట్ల పనుల రద్దు


దేవుళ్ల మీద ఒట్లు పెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, రుణమాఫీ పేరుతో రైతులను వంచించిందని హరీశ్ రావు ఆరోపించారు. ఒక్క సిద్దిపేట నియోజకవర్గంలోనే 52 శాతం మంది రైతులకు (సుమారు 22,819 మందికి) ఇంకా రుణమాఫీ కాలేదని, సీఎం పర్యటిస్తున్న నర్మెట్ట గ్రామంలోనే 350 మంది బాధితులు ఉన్నారని తెలిపారు. అలాగే, గత మూడు సీజన్ల రైతుబంధు బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.

harish rao on cm revanth siddipet tour

Also Read..| జ‌న‌గ‌ణ‌న అప్ప‌టినుండే ప్రారంభం..

రాజకీయ కక్షతో సిద్దిపేటలో దాదాపు రూ. 1070 కోట్ల విలువైన అభివృద్ధి పనులను రేవంత్ రెడ్డి రద్దు చేశారని హరీశ్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. సగం పనులు పూర్తయిన వెటర్నరీ కాలేజీని తన సొంత నియోజకవర్గం కొడంగల్‌కు తరలించుకుపోవడం ముఖ్యమంత్రి స్థాయికి తగదని విమర్శించారు. నిలిపివేసిన రంగనాయక సాగర్ టూరిజం, ఔటర్ రింగ్ రోడ్, శిల్పారామం వంటి పనులను తక్షణమే పునరుద్ధరించాలని ఆయన డిమాండ్ చేశారు.

Share the post