Monday, March 24, 2025
HomeNewsNationalఉగాది పండుగ ఎందుకు జరుపుకుంటామంటే..

ఉగాది పండుగ ఎందుకు జరుపుకుంటామంటే..

పంచాంగం ప్రకారం ప్రతి ఉగాదికి ఒక్కో పేరు ఉంటుంది. ‘యుగాది’ ‘ఆది’ అనే పదాలు కలిసి ఉగాది అనే పదం ఏర్పడింది. యుగం అంటే వయస్సు , ఆది అంటే ప్రారంభం అని అర్థం. మహారాష్ట్రలో ఉగాది పండుగను ‘గుడి పడ్వా’ పేరుతో జరుపుకుంటారు. ఈ పండుగను బెంగాలీలు “పోయిలా భైశాఖ్”, సిక్కులు “వైశాఖీ”, మలయాళీలు “విషు” అనే పేరుతో సెలబ్రేట్ చేసుకుంటారు.

పండుగ విశేషాలివీ..

మత్స్యావతారం ధరించిన విష్ణుమూర్తి సోమకుని సంహరించి వేదాలను తిరిగి బ్రహ్మకు అప్పగించిన సందర్భంగా ‘ఉగాది’ ఆచరణ లోకి వచ్చిందని అంటారు. బ్రహ్మ దేవుడు ఈ జగత్తును చైత్ర మాస శుక్ల పక్ష ప్రథమ దినాన సూర్యోదయ వేళ సమగ్రంగా సృష్టించాడని చెబుతారు. కాల గణనాన్ని గ్రహ, నక్షత్ర, ఋతు, మాస, వర్ష, వర్షాధికులను బ్రహ్మ దేవుడు ఈనాడు ప్రవర్తింప చేశాడన్నది పెద్దల భావన. శ్రీరాముడు, విక్రమాదిత్యుడు, శాలివాహనుడు రాజ్యాధికారం స్వీకరించి పట్టాభిషిక్తులైన రోజు కూడా ఉగాదే.. ఉగాది టైం లోనే వసంత ఋతువు కూడా మొదలవుతుంది. కొత్త జీవితానికి గుర్తుగా ఉగాది పండుగను జరుపుకొంటారు.

ఉగాది పండుగ రోజున కొత్త పనులు మొదలు పెడుతుంటారు. బంగారం, కొత్త వస్తువులు,కొత్త వాహనాలు, కొత్త ఇళ్లు లాంటివి కొంటారు. కొత్త వ్యాపారానికి కూడా శుభ తరుణంగా భావిస్తారు. ఉగాది పండుగ రోజున పులిహోర, పాయసం, బొబ్బట్లు అనేవి ఫేమస్ ఫుడ్ ఐటమ్స్. కొత్త మామిడి కాయలు, వేపపువ్వు, బెల్లం, పులుపు, కారం ఇలా షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడిని పండుగ వేళ తయారు చేస్తారు. ఉగాది రోజున పంచాంగ శ్రవణం వింటే మంచిదని పెద్దలు చెబుతారు. ఆదాయ వ్యయాలు, రాజ పూజ్య అవమానాలు, కందాయ ఫలాలు, రాశి ఫలాలు తెలియజెప్పే పంచాంగం వినటం ఆనవాయితీ..

Share the post
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us
https://news2telugu.com
శిగుల్ల రాజు న్యూస్2తెలుగులో వార్తా కథనాలు అందిస్తారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశారు.
RELATED ARTICLES

Most Popular

Recent Comments