అర్బన్ నక్సల్స్, కమ్యూనిస్టు పార్టీలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మరోసారి నిప్పులు చెరిగారు. కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం చేసిన అభివ్రుద్ధి కన్పించని కబోధులని అభివర్ణించారు. అమాయకులను రెచ్చగొట్టి ఆయుధాలు చెతపట్టించి వారు చావులకు కారకులైన అర్బన్ నక్సల్స్ సాధించిందేమిటని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏం సాధించిందని ఆ పార్టీకి మద్దతిస్తూ రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వాములయ్యారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వాళ్లకు ఏమాత్రం నైతికత ఉన్నా… ఆ పదవులకు రాజీనామా చేసి బయటకు వచ్చి వాస్తవాలు మాట్లాడాలని డిమాండ్ చేశారు.
నగరాల్లో, పట్టణాల్లో ఏసీ రూముల్లో ఉంటూ బూటకపు ఎన్ కౌంటర్ల గురించి మాట్లాడుతున్న సోకాల్డ్ కమ్యూనిస్టులు, అర్బన్ నక్సల్స్ ఎన్నడైనా లొంగిపోవాలని చెప్పారా? వాళ్లు చనిపోయాక మాత్రం బూటకపు ఎన్ కౌంటర్లని మాట్లాడుతూ పాటలు పాడి శవాలకు నివాళి అర్పించడం తప్ప వాళ్లు చేసిందేమిటి?. ఒకవైపు రాజ్యాంగాన్ని కాపాడాలని వాళ్లే ఆందోళనలు చేస్తారు. ఇంకోవైపు అదే రాజ్యాంగానికి వ్యతిరేకంగా తుపాకీ పట్టి నక్సలిజంలో చేరాలని అమాయకులను రెచ్చగొడతారు? ఇదేం ద్వంద్వ నీతి. అసలు వాళ్లకు స్పష్టత, లక్ష్యం ఉందా అని అన్నారు.
బీజేపీకి ఒక లక్ష్యం ఉంది. బ్యాలెట్ ను నమ్ముకుని బీజేపీ వరుసగా కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. దాదాపు 20 రాష్ట్రాల్లో అధికారంలో కొనసాగుతోంది. కోట్లాది మందికి అభివ్రుద్ధి, సంక్షేమ ఫలాలను అందిస్తున్నం. 25 కోట్ల మందిని పేదరికం నుండి బయటకు తీసుకొచ్చినం. కోట్లాది మందికి ఉచితంగా రేషన్ సహా సంక్షేమ పథకాల లబ్ది చేకూరుస్తున్నం. ఆర్దిక ప్రగతిలో భారత్ ను 4వ స్థానానికి తీసుకొచ్చి అమెరికా, రష్యా, చైనా, జపాన్ సరసన చేర్చినం. మా లక్ష్యం 2047 నాటికి వరల్డ్ నెంబర్ వన్ దేశంగా భారత్ ను మార్చేందుకు వికసిత్ భారత్ దిశగా ముందుకు సాగుతున్నాం అని అని ప్రశ్నించారు.
మోదీ సంక్షేమ పథకాలు మీకు కన్పించడం లేదు? మేం చేసిన అభివ్రుద్ధి కన్పించడం లేదు? ఉచిత రేషన్ బియ్యం కన్పించదు. 10 లక్షల మందికి రోజ్ గార్ మేళా పేరుతో ఉద్యోగాలిచ్చినం. గాంధీ ఆశయాలకు అనుగుణంగా గ్రామాలను అభివ్రుద్ధి చేస్తున్నాం. చిట్ట చివరి వ్యక్తికి అభివ్రుద్ధి, సంక్షేమ ఫలాలు అందించాలని దీన్ దయాళ్ సిద్దాంతాన్న అమలు చేస్తున్నాం… మేం ఇన్ని చేసినా మీకు కన్పించదు. మేం చేసిన అభివ్రుద్ధి కన్పించదు. మతతత్వవాదులని ముద్ర వేస్తారు. ఇదేం పద్దతి అని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ వంద రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేస్తామని ఎగ్గొట్టారు? భూమలిచ్చారా? ఉద్యోగాలిచ్చారా? నిరుద్యోగ భ్రుతి ఇచ్చారా? మహిళలకు నెలనెలా రూ.2500 లు ఇచ్చారా? వ్రుద్దులకు రూ.4 వేల పెన్షన్ ఇచ్చారా? మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో మీకు నచ్చింది ఏమిటి? ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వంలో పదవులు తీసుకుని భాగస్వాములు అవుతున్నారు అని అన్నారు.
ఆయుధం పట్టిన వాళ్లకు ఆనందం ఉండదు. జీవితాంతం టెన్షనే. తిండి తిప్పలు లేక కుటుంబ సభ్యులకు దూరమై అల్లాడుతుంటే అర్బన్ నక్సలైట్లు మాత్రం ఏసీ గదుల్లో ఎంజాయ్ చేస్తూ మావోయిజం వర్ధిల్లాలి…తాడిత పీడిత వర్గాలు ఏకం కావాలంటూ మాయ మాటలు చెబుతూ పబ్బం గడుపు కుంటున్నారు. చిన్నపిల్లలకు తుపాకులిచ్చి కాల్చమని చెప్పడం ఏం సిద్దాంతం అని ప్రశ్నించారు
‘‘ఏసీల్లో ఉండి కబుర్లు చెప్పడం సరికాదు… సుందరయ్య విజ్ఝాన కేంద్రంలో మీటింగ్ లు పెట్టడం కాదు. ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలు చేస్తూ పాటలు పాడటంకాదు. మీకు నైతికత, చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వంలో ఉంటూ పదవులు పొందిన వాళ్లు, కమిషన్ లో, కమిటీల్లో ఉన్న వారు తక్షణమే ఆ పదవులకు రాజీనామా చేయాలన్నారు.
మోదీ ప్రభుత్వం చేసిన అభివ్రుద్ధిని అడవిలో ఉన్న నక్సలైట్లు గుర్తించి లొంగిపోతున్నారు. మీకు మాత్రం అభివ్రుద్ధి కన్పించదా?. అర్బన్ నక్సల్స్ మాటలు వింటుంటే… సీనియర్ కమ్యూనిస్టు నాయకుడొకరు అన్న మాటలు గుర్తుకొస్తున్నాయి. 60 ఏళ్ల తరువాత కమ్యూనిజం గురించి మాట్లాడితే వాళ్లకు మానసిక రోగం ఉన్నట్లే అని అన్నారు.
Also Read..| ఫార్ములా ఈ కార్ రేసులో కేటీఆర్ కు షాక్.. !
మాజీమంత్రి కేటీఆర్ ప్రాసిక్యూషన్ కు గవర్నర్ అనుమతివ్వడాన్ని మేం స్వాగతిస్తున్నాం…. ఇన్నాళ్లు బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అని ఎన్నికలకు ముందు ఆరోపించిన సీఎం ఇప్పుడేమంటారు?. రాష్ట్రంలో ఆర్కే (రేవంత్ రెడ్డి, కేటీఆర్) పాలన కొనసాతోంది. అవినీతికి పాల్పడే వాళ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ మోదీ ప్రభుత్వం సహించదు. కచ్చితంగా చర్యలుంటాయి. నేను అభివ్రుద్ధిపై మాట్లాడితే మీడియా ఇవ్వడం లేదు… హిందుత్వంపైనే ఫోకస్ చేస్తున్నారు. భవిష్యత్తులో రాజమౌళి దేవుడిని నమ్మేలా చూడాలని, ఆయన బాగుండాలని కోరుకుంటున్నానని అన్నారు.









