పారిస్ ఒలింపిక్స్ లో ఫైనల్ కు చేరి.. అనూహ్య రీతిలో అనర్హత వేటు ఎదుర్కొన్న భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ పారిస్ నుంచి స్వదేశానికి వచ్చారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆమెకు అభిమానులు ఘనస్వాగతం పలికారు. రెజ్లర్లు సాక్షి మాలిక్, బజరంగ్ పునియా తదితరులు అక్కడికి చేరుకున్నారు. అభిమానులను చూడగానే వినేశ్ ఫొగాట్ ఒకింత భావోద్వేగానికి లోనయ్యారు. ఆమెను పలువురు ఓదార్చారు.
#WATCH | Indian wrestler Vinesh Phogat breaks down as she arrives at Delhi's IGI Airport from Paris after participating in the #Olympics2024Paris. pic.twitter.com/T6LcZzO4tT
— ANI (@ANI) August 17, 2024