Wednesday, June 18, 2025
HomeNewsNationalదేశ ఆర్థిక వ్యవస్థలో గనుల పాత్ర కీలకం.. వాటిని సద్వినియోగం చేసుకోవాలి: కేంద్ర మంత్రి కిషన్...

దేశ ఆర్థిక వ్యవస్థలో గనుల పాత్ర కీలకం.. వాటిని సద్వినియోగం చేసుకోవాలి: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

దేశ ఆర్థికాభివృద్ధిలో గనుల రంగం పోషిస్తున్న పాత్ర కీలకమని రానున్న రోజుల్లో దేశం గనుల రంగంలో స్వయంసమృద్ధి సాధించే దిశగా మరింత కృషి జరగాలని కేంద్ర గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి పేర్కొన్నారు. దేశంలో ఎక్కువ సంఖ్యలో ఉపాధి కల్పిస్తున్నది మైనింగ్ పరిశ్రమే అని ఆయన అన్నారు.

బుధవారం ఢిల్లీలోని అంబేడ్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లో.. దేశవ్యాప్తంగా అత్యున్నత ప్రమాణాలతో, సుస్థిరాభివృద్ధి నిబంధనలకు అనుగుణంగా మైనింగ్ చేస్తున్న 68 సంస్థలకు కేంద్రమంత్రి 5 స్టార్ అవార్డుల ప్రదానం చేశారు. ఈ అవార్డులు అందుకున్న వారిలో.. తెలంగాణ నుంచి 5, ఆంధ్రప్రదేశ్ నుంచి 5 మైనింగ్ సంస్థలున్నాయి.

అనంతరం కేంద్రమంత్రి మాట్లాడుతూ.. అవార్డులు పొందిన వారందరినీ హృదయపూర్వకంగా అభినందించారు. మైనింగ్ రంగంలో సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను చేరుకునేందుకు, పర్యావరణాన్ని కాపాడేందుకు పనిచేస్తున్న వారందరినీ అభినందించడం కేంద్రప్రభుత్వం బాధ్యతన్నారు. ఈ అవార్డులు.. మైనింగ్ రంగం చేస్తున్న కృషిని ప్రోత్సహించడానికేనని.. ఆయన పేర్కొన్నారు.

ఈ వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ హైదరాబాద్ లో ఓ వర్క్ షాప్ నిర్వహించారని గుర్తుచేసిన కేంద్రమంత్రి.. ఆ కార్యక్రమంలో మైనింగ్ పరిశ్రమ ప్రతినిధులు ఇచ్చిన సూచనల ఆధారంగా.. కొత్త నిబంధలను నిర్దేశించుకుని ముందుకెళ్తున్నామన్నారు. మైనింగ్ రంగం, మంత్రిత్వ శాఖ సమన్వయంతో పనిచేస్తూ.. దేశాభివృద్ధిలో భాగస్వామ్యం కావాల్సిన అవసరం ఉందన్నారు.

భారతదేశంలో అపారమైన ఖనిజ సామర్థ్యం ఉందని, దీన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ గారి ఆలోచన ప్రకారం.. భారతదేశం ఈ రంగంలో స్వయంసమృద్ధిని సాధించాల్సిన అవసరం ఉందన్నారు. క్రిటికల్ మినరల్స్ ను విదేశాలనుంచి దిగుమతి చేసుకుంటున్నామని, మన దేశంలో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుంటే.. దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

మైనింగ్ లో సాంకేతికతను సద్వినియోగం చేసుకుంటూ.. అభివృద్ధితోపాటుగా పర్యావరణాన్ని కాపాడేదిశగా పనిచేయాలని మైనింగ్ కంపెనీలకు కిషన్ రెడ్డి సూచించారు. గనుల భద్రత, కార్మికుల భద్రత, ఉత్పత్తిని పెంచడం, పర్యావరణ పరిరక్షణ.. వంటి అంశాల్లో సాంకేతికత వినియోగం చాలా అవసరమని ఆయన అన్నారు.

ఇటీవల బడ్జెట్లో .. 25 క్రిటికల్ మినరల్స్ మీద కస్టమ్స్ డ్యూటీని కేంద్రం తొలగించిందని, దీని ద్వారా దేశంలో క్రిటికల్ మినరల్స్ ప్రాసెసింగ్ మెరుగుపడుతుందని కిషన్ రెడ్డి చెప్పారు. ‘భారతదేశం ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్నాం. రానున్న రోజుల్లో 3వ ఆర్థిక వ్యవస్థగా మారాలి. ఈ దిశగా మైనింగ్ రంగం తమ సామర్థ్యానికి అనుగుణంగా పనిచేయాలి’ అని ఆయన చెప్పారు.

ఈ కార్యక్రమంలో కేంద్ర బొగ్గు గనుల శాఖ సహాయ మంత్రి సతీశ్ చంద్ర దూబే జీ, గనుల శాఖ కార్యదర్శి వీఎల్ కాంతారావు, అదనపు కార్యదర్శి లోహియా, ఐబీఎం సెక్రటరీ జనరల్ పీఎన్ శర్మతో పాటు వివిధ రాష్ట్రాల గనుల శాఖ ఉన్నతాధికారులు, అవార్డు గ్రహీతలు, మైనింగ్ రంగ ప్రముఖులు పాల్గొన్నారు.

5 starred mines form Telugu States

ఆంధ్రప్రదేశ్ నుంచి 5 (అన్నీ లైమ్ స్టోన్ మైన్స్)

భారతి సిమెంట్స్ లైమ్ స్టోన్ మైన్ కడప

JSW సిమెంట్స్ లైమ్ స్టోన్ నంద్యాల

దాల్మియా సిమెంట్స్ నవాబ్‌పేట – తలమంచిపట్నం.

అల్ట్రాటెక్, తుమ్మల పెంట

శ్రీ జయజ్యోతి (మైహోం) సిమెంట్స్, కర్నూల్

తెలంగాణ నుంచి 5 (అన్నీ లైమ్ స్టోన్ మైన్స్)

మైహోం చౌటుపల్లి-1

TSMDC – దేవాపూర్ (మంచిర్యాల)

మైహోం – మెల్ల చెరువు

రైన్ సిమెంట్స్ – నల్గొండ

సాగర్ సిమెంట్స్ నల్గొండ

Share the post
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us
https://news2telugu.com
శిగుల్ల రాజు న్యూస్2తెలుగులో వార్తా కథనాలు అందిస్తారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశారు.
RELATED ARTICLES

Most Popular

Recent Comments