సనాతన ధర్మం సామాజిక న్యాయానికి విరుధ్దం అని.. దానిని నిర్మూలించాలని తమిళనాడు మంత్రి, ముఖ్యమంత్రి స్టాలిన్ కుమారుడు ఉదయనిధి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతే కాకుండా సనాతన ధర్మాన్ని మలేరియా, డెంగ్యూ లాంటి వ్యాధులతో పోల్చాడు. దీనిని వ్యతిరేకించడం కాదు. నిర్మూలించాలని పిలుపు నిచ్చాడు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దేశ వ్యాప్తంగా ఆయనపై సోషల్ మీడియాలో విరుచుకుపడుతున్నారు. భారతదేశంలోని 80% జనాభా సనాతన ధర్మాన్నిఆచరిస్తున్నారని బిజెపి ఐటి సెల్ చీఫ్ అమిత్ మాలవీయ తెలిపారు. అందరినీ సామూహిక మారణహోమం చేయాలని మంత్రి పిలుపునివ్వడంగా అభిప్రాయ పడుతున్నామని అన్నారు.
సనాతన ధర్మాన్ని ఆచరించే వారిని తాను ఏమీ అనలేదని.. కులాలు, మతాల పేరుతో సనాతన ధర్మం సమాజాన్ని విభజిస్తుందని ఉదయనిధి వివరణ ఇచ్చారు. తాను మాట్లాడిన ప్రతీమాటకు కట్టుబడి ఉంటానని స్షష్టం చేశారు. సనాతన ధర్మం వల్ల బాధ పడుతున్నబడుగు, బలహీన వర్గాల తరపున మాట్లాడానని తెలిపారు. మలేరియా, డెంగ్యూ, కోవిడ్ లాంటి రోగాలు సమాజానికి ఎంత హానికరమో.. సనాతన ధర్మం కూడా హానికరమే అని ట్వీట్ చేశాడు. అంతే కాకుండా, ఈ అంశంపై తనకు ఎవరైనా నోటీసులు పంపినా.. సవాళ్లు విసిరినా తాను సిద్దంగా ఉంటానని ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు.
Bring it on. I am ready to face any legal challenge. We will not be cowed down by such usual saffron threats. We, the followers of Periyar, Anna, and Kalaignar, would fight forever to uphold social justice and establish an egalitarian society under the able guidance of our… https://t.co/nSkevWgCdW
— Udhay (@Udhaystalin) September 2, 2023