ప్రమాదాన్ని గమనించిన వృద్ధ దంపతులు అర్థరాత్రి రైల్వే ట్రాక్‌పై పరిగెత్తి వేగంగా వస్తున్న ఎక్స్‌ప్రెస్ రైలును ఆపేసి భారీ ప్రమాదం నుండి కాపాడారు. చెన్నై – భగవతీపురం రైల్వే స్టేషన్ సమీపంలో ఘాట్ రోడ్డు నుండి ప్లైవుడ్ లోడ్‌తో వెళ్తున్న ట్రక్ ప్రమాదవశాత్తు అదుపుతప్పి రైల్వే ట్రాక్‌పై పడిపోయింది. వెంటనే వారు రైలు పట్టాలపై పరిగెత్తుకుంటూ రెలుకు ఎరదురుగా ఎరుపు రంగు బట్ట చూపించగా.. రైలు ఆగింది. దీంతో పెను ప్రమాదం తప్పింది. తమ ప్రాణాలకు తెగించి ప్రమాదం జరగకుండా కాపాడిన వృద్ద దంపతుతలను పలువురు అభినందిస్తున్నారు.