Menu

  • Home
  • జాతీయం
  • నేడే కేంద్ర కేబినెట్‌ చివరి భేటీ.. మంత్రులకు ప్రధాని వీడ్కోలు పార్టీ..
Image

నేడే కేంద్ర కేబినెట్‌ చివరి భేటీ.. మంత్రులకు ప్రధాని వీడ్కోలు పార్టీ..

ప్ర‌ధాని న‌రెంద్ర మోడీ నేతృత్వంలో కేంద్ర కేబినెట్‌ ఆదివారం (మార్చ్‌ 3) భేటీ అవనుంది. పార్లమెంట్‌ ఎన్నికలకు త్వరలో షెడ్యూల్‌ విడుదలవనుండడంతో ఈ ప్రభుత్వంలో ఇదే చివరి కేబినెట్‌ సమావేశం కానుంది. ఈ భేటీలో కేంద్ర మంత్రులకు ప్రధాని మోదీ వీడ్కోలు పలకనున్నారు. వారికి వీడ్కోలు పార్టీ కూడా ఇవ్వనున్నారు. మూడవ సారి పార్టీని అధికారం లోకి తెచ్చేందుకు అమలు చేయాల్సిన వ్యూహాలు, ప్రణాళికలపై ఈ సమావేశంలో ప్రధాని మోదీ మంత్రులతో చర్చించే అవకాశాలున్నాయి. ఢిల్లీ లోని చాణక్యపురి డిప్లమాటిక్ ఎనక్లేవ్‌ లోని సుష్మా స్వరాజ్ భవన్‌లో తుది కేబినెట్‌ భేటీ జరగనుంది. ఈ నెల లోనే లోక్‌సభ సాధారణ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల కమిషన్‌ (సీఈసీ) షెడ్యూల్ విడుదల చేయనుంది.

Share the post

Also Read..